Kill Movie OTT: మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన అత్యంత హింసాత్మక ఇండియన్ మూవీ ‘కిల్’ - కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్!
Kill Movie OTT Release: జులై 5న థియేటర్లలో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది ‘కిల్’. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలయిన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చి అందరికీ షాకిచ్చింది.
Kill Movie OTT Release Date: ఈరోజుల్లో ఏ సినిమా అయినా కొత్తగా ఉంటేనే దానిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా మునుపెన్నడూ చూడని కథలు, కథనాలతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే బాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే మునుపెన్నడూ వయొలెన్స్‌ను చూపిస్తూ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్.. ‘కిల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక థియేటర్లలో విడుదలయిన రెండు వారాలకే ఈ మూవీ ఓటీటీలో విడుదలయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
మూడు వారాలకే..
లక్ష్య హీరోగా, రాఘవ్ జుయల్ విలన్‌గా తెరకెక్కిన చిత్రమే ‘కిల్’. మామూలుగా ఇండియన్ సినిమాల్లో రక్తపాతం, వైలెన్స్‌ను ఎక్కువగా చూపించరు. అవి కూడా ప్రేక్షకులు చూడలేనంత డిస్టర్బింగ్‌గా చూపించడానికి మేకర్స్ ఇష్టపడరు. కానీ ‘కిల్’ అలా కాదు. మొదట్లో స్లోగా ప్రారంభమయ్యే ఈ మూవీ.. సెకండ్ హాఫ్ మొత్తం దారుణమైన వైలెన్స్‌తో నిండిపోతుంది. ఇక జులై 5న ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. థియేటర్లలో విడుదలయిన మూడు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ అది ఇండియాలో కాదు.
అక్కడ మాత్రమే..
‘కిల్’ మూవీ ఓవర్సీస్‌లో ఉన్న ఓటీటీ వ్యూయర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను 24.99 డాలర్లు పే చేసి చూసుకోవచ్చు సబ్‌స్క్రైబర్స్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు యాపిల్ టీవీలో కూడా వీడియో ఆన్ డిమాండ్ (వీఓడీ) కేటగిరిలో ‘కిల్’ యాడ్ అయ్యింది. అమెరికాలో మాత్రమే కాకుండా యూకేలో ఉండే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్స్‌కు కూడా ఈ సినిమా రెంట్‌కు అందుబాటులో ఉంది. ఇండియా కంటే ముందే ఈ మూవీ యూఎస్, యూకే ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఇక ఓవర్సీస్ ఓటీటీల్లో ‘కిల్’ సందడి చేస్తుండడంతో ఇండియాలో కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
#kill ott released but not for Indian audience 🧐 pic.twitter.com/MItHilBI0B
— Abinesh (@Abinesh0517) July 22, 2024
మూడు నెలలు..
‘కిల్’ మూవీ క్లీన్ హిట్‌ను సాధించింది కాబట్టి ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. సూపర్ హిట్ అయిన చిత్రాలు అన్నీ థియేటర్లలో విడుదలయిన మూడు నెలల తర్వాతే ఓటీటీలోకి రావాలని డిసైడ్ అయ్యాయి. ఆ కేటగిరిలో ‘కిల్’ కూడా యాడ్ అవుతుంది. కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మోహతా, అచిన్ జైన్ లాంటి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. లక్ష్య, రాఘవ్‌తో పాటు ఆశిష్ విద్యార్థి, తాన్యా మనిక్తలా, అభిషేక్ చౌహాన్ కూడా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. లక్ష్యకు హీరోగా ఇది మొదటి సినిమానే అయినా ఇందులో తన పర్ఫార్మెన్స్‌తో చాలామంది బడా మేకర్స్ కంటపడ్డాడు ఈ యంగ్ హీరో.