RRR Documentary On Netflix : వైరల్ అవుతోన్న రాజమౌళి సినిమా అప్డేట్.. మహేశ్ బాబుతో కాదు, మళ్లీ ఆ స్టార్స్ కాంబినేషనే!
Rajamouli : రాజమౌళి సినిమా అప్ డేట్ వచ్చింది. అయితే అది మహేశ్ బాబుతో తీయబోయే సినిమా గురించి కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాత్రమే. ఇప్పుడిదే ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్.
RRR Documentary : సరిగ్గా ఆరేళ్ల క్రితం, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్... వీళ్లు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఫోటో టాలీవుడ్ లో అప్పట్లో సంచలనం అయింది. అప్పటివరకూ ఎవరూ ఊహించని కాంబినేషన్ ను ‘ఆర్ఆర్ఆర్(RRR)’ రూపంలో వెండితెరపై చూపించారు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్ల గా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’. థియేటర్ లోనే కాదు, తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ సినిమా ఆస్కారంత ఎత్తుకు ఎదిగింది. ఆ సందర్భంలోనే నెట్ ఫ్లిక్స్ తొలిసారిగా రాజమౌళి పై డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఆసక్తి కరమైన అప్ డేట్ ఒకటి వచ్చింది. ఆర్ఆర్ఆర్ పై రూపొందిన డాక్యుమెంటరీ త్వరలో మన ముందుకు రానుంది.
ఎస్ఎస్ఎంబీ29 అప్ డేట్ కాదు
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా నోరు విప్పడం లేదు. ఎక్కడైనా ఈ సినిమా గురించి అడిగితే, ‘గ్లోబ్ థ్రోట్లింగ్ అడ్వెంచర్’ నేపథ్యంలో ఉండబోతోందని మాత్రమే హింట్ ఇచ్చారు. ఈ సినిమా కథాకథనాల గురించి చిన్న లీక్ కూడా లేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా వచ్చే సంక్రాంతి తర్వాత మహేశ్ సినిమా ప్రారంభం అవుతుందని ఎవరి కథలు వాళ్లు అల్లుకుంటున్నారు. అయితే, ఈ లోగా ఆర్ఆర్ఆర్(RRR) సినిమా యూనిట్ నుంచి ఫ్యాన్స్ కు ఈ రోజు సడన్ సర్ ప్రైజ్ వచ్చింది.
కొద్ది సేపటిలో మీకో అప్డేట్ అంటూ ఎమోజీ రూపంలో ఊరించింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ . ‘‘ఒరేయ్ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారా? ఏదో ఒకటి చెప్పరా’’ అంటూ ఒక ఫ్యాన్ ఎగ్జైట్ అయ్యాడు. ఎవరికి వాళ్లు మామూలుగానే థియరీలు పంచేసుకున్నారు. కొద్దిసేపటికి అసలు విషయం వెల్లడైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన ఓ డాక్యుమెంటరీ రానుంది. ఆర్ఆర్ఆర్ ‘బిహైండ్ అండ్ బియాండ్’ అనే పేరుతో రూపొందిన డాక్యుమెంటరీని ఇదే నెలలో తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్.
యాక్షన్ వెనుక కథ
రాజమౌళి సినిమా అంటేనే ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు తప్పని సరిగా ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’లోనూ అంతే. ఇద్దరు హీరోలూ బ్రిడ్జ్ పై నుంచి కిందకు వేలాడుతూ పిల్లాడిని కాపాడే సన్నివేశం, ఇంటర్వెట్ ఫైట్, క్లైమ్యాక్స్ ఫైట్... ఇలాంటి క్రేజీ ఫైట్స్ ను ఎలా చిత్రీకరించారో, వాటి వెనుక చిత్ర యూనిట్ పడిన శ్రమ... ఇవన్నీ ఈ డాక్యుమెంటరీ లో పొందుపరించారట. ఈ సినిమా విశేషాలనూ చిత్ర యూనిట్ వీక్షకులతో పంచుకోబోతోంది. అలియాభట్, సముద్రఖని, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భవిష్యత్తులో సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి. అయితే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ డేట్ ను ఇంకా వెల్లడించలేదు నెట్ ఫ్లిక్స్.
Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?