Hidimba OTT Release : థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి 'హిడింబ' - ఆహాలో ఆ రోజే
Hidimba OTT Release Date and Time : అశ్విన్ బాబు, నందితా శ్వేతా జంటగా నటించిన సినిమా 'హిడింబ'. ఆహా ఓటీటీలో అతి త్వరలో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
![Hidimba OTT Release : థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి 'హిడింబ' - ఆహాలో ఆ రోజే Hidimba OTT Release Date Ashwin Babu, Nandita Swetha's Intense Crime Thriller Set to Premiere on AHA Hidimba OTT Release : థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి 'హిడింబ' - ఆహాలో ఆ రోజే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/05/377288ef363cd1fef2a0c0ebc5379c0e1691253286534313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న యువ కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu). ఆ సిరీస్ కంటే ముందు 'జీనియస్', 'జత కలిసే' చిత్రాలు, 'రాజు గారి గది' సిరీస్ మధ్యలో 'నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్' చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హిడింబ' (Hidimba Movie). అందులో నందితా శ్వేతా (Nandita Swetha) కథానాయికగా నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్వరలో ఓటీటీలో సందడి చేయనుందీ సినిమా.
'ఆహా'లో ఆగస్టు 10న 'హిడింబ'
Hidimba Movie OTT Release Date : ఆగస్టు 10 నుంచి 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో 'హిడింబ' స్ట్రీమింగ్ కానుంది. జూలై 20న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు 'హిడింబ' సినిమా ఓటీటీలో ప్రజల ముందుకు వస్తోంది. ఆగస్టు 10న సాయంత్రం 7 గంటల నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతుందని 'ఆహా' వర్గాలు తెలిపాయి.
Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!
View this post on Instagram
'హిడింబ' కథ ఏమిటంటే?
హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతారు. సుమారు 16 మంది మిస్ అయ్యారని కేసులు నమోదు అవుతాయి. లోకల్ పోలీసుల పనితీరు మీద విమర్శలు వ్యక్తం అవుతాయి. అప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా) ను కేరళ నుంచి ప్రత్యేకంగా పిలిపిస్తారు. అప్పటి వరకు కేసును ఇన్వెస్టిగేట్ చేసిన అభయ్ (అశ్విన్ బాబు) కొత్తగా వచ్చిన ఆద్యకు సహాయ సహకారాలు అందించడా? లేదా? అరాచకాలకు అడ్డాగా మారిన కాలాబండాలోని బోయా (రాజీవ్ పిళ్ళై) ఎవరు? ఆద్య గతం ఏమిటి? నరమాంస భక్షక గిరిజన జాతి హిడింబాలకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? కేరళలో కొన్నేళ్ళ క్రితం అదృశ్యమైన మహిళల కేసుకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? అంతరించిపోయిన హిడింబ జాతిలో చివరి వ్యక్తి ఎవరు? చివరకు ఏమైంది? అనేది సినిమా కథ.
కాలాబండలో అశ్విన్ బాబు చేసిన ఫైట్ మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక, రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నంగా పోలీస్ రోల్ చేశారు నందితా శ్వేతా. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది.
Also Read : మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?
నందమూరి కళ్యాణ్ రామ్ 'అసాధ్యుడు', మంచు మనోజ్ 'మిస్టర్ నూకయ్య', సందీప్ కిషన్ 'రన్' సినిమాలు తీసిన అనిల్ కన్నెగంటి 'హిడింబ' తీశారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) పతాకంపై అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ సినిమాను నిర్మించారు. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి మాటలు రాయగా... వికాస్ బాడిస సంగీతం అందించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)