పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులు బుట్ట బొమ్మ అంటారు. ఆ బొమ్మ బార్బీలా మారితే... 'ఈ బార్బీ మేజిక్ ను నమ్ముతుంది' అని ఈ ఫోటోలకు పూజా హెగ్డే క్యాప్షన్ ఇచ్చారు. తనను తానూ బార్బీగా వర్ణించారు పూజా హెగ్డే. అఫ్ కోర్స్... ప్రేక్షకులు చెప్పే మాట కూడా అదే. సినిమాలకు వస్తే... 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు పూజ. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అయితే... ఆ సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉందట. సాయి తేజ్ సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పూజా హెగ్డే (All Images Courtesy : hegdepooja / Instagram)