Ghaati OTT: ఆ ఓటీటీలోకి అనుష్క 'ఘాటి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Ghaati OTT Platform: స్వీటీ అనుష్క 'ఘాటి' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా రోజుల తర్వాత అనుష్క విశ్వరూపం చూశామంటూ అందరూ కామెంట్స్ చేస్తుండగా... ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.

Anushka Shetty's Ghaati OTT Release Platform Locked: చాలా రోజుల తర్వాత స్వీటీ అనుష్క పవర్ ఫుల్ పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో అనుష్క యాక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. సోషల్ మీడియాలోనూ మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ డీల్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఆ ఓటీటీలోకే...
'ఘాటి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు 8 వారాల తర్వాత వివిధ భాషల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా... స్వీటీతో పాటు చైతన్యరావు, విక్రమ్ ప్రభు, జగపతిబాబు, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
Also Read: 'అఖండ 2' రిలీజ్ డేట్‌పై బాలయ్య లీక్స్ - ఫ్యాన్స్ ఫుల్ ఖుష్... అది కన్ఫర్మ్‌యేనా?
అనుష్క నట విశ్వరూపం
స్వీటీ అనుష్క చాలా రోజుల తర్వాత 'ఘాటి' మూవీలో పవర్ ఫుల్ రోల్‌లో కనిపించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఆమె సెలెక్టెడ్‌గా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. అనుష్క కెరీర్‌లోనే 'ఘాటి' మంచి మూవీగా నిలుస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షీలావతిగా అనుష్క అదరగొట్టారని... ఫస్టాఫ్ చాలా బాగుందని తెలిపారు. ఇక సెకండాఫ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. క్రిష్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'ఘాటి'ల్లో గంజాయి అక్రమ రవాణా, అక్కడి వారిని స్మగ్లర్లు తమ స్వార్థానికి వాడుకుంటుండగా... ఓ వర్గానికి చెందిన వారిని ఆ ముఠా బారి నుంచి కాపాడేందుకు షీలావతి ఏం చేశారు? అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. స్వీటీ నటన, సంగీతం మూవీకే హైలెట్ అని... కాకపోతే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌పై ఇంకా కాన్సన్‌ట్రేట్ చేస్తే బాగుండేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.





















