అన్వేషించండి

Jagadeesh Cheekati: దూరదర్శన్ ఉద్యోగి నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు - సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి ఇంటర్వ్యూ

Jagadeesh Cheekati: ‘అర్జున్ చక్రవర్తి’ సినిమాకుగానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు గెలుచుకున్న కెమెరామెన్ జగదీష్ చీకటి, తన సంతోషాన్ని, ఆ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

Cinematographer Jagadeesh Cheekati interview: ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి సంబంధించి మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా విజువల్స్‌ పరంగా ట్రెమండస్ రెస్సాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందించారు. విజువల్స్ పరంగా అత్యున్నతంగా ఈ సినిమా ఉందనేలా జగదీష్ చీకటి పనితనాన్ని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా ఆయన అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ చీకటి మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..

నేపథ్యం - సినీ ప్రయాణం
నేను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు పొందాను. నాకు డ్రాయింగ్, ఫోటోగ్రఫీ అంటే  మొదటి నుంచి చాలా ఇష్టం. ఫోటోగ్రఫీలోనూ మాస్టర్స్ చేశా. దూరదర్శన్‌లో కూడా కొంతకాలం పని చేశా. స్టిల్ ఫోటోగ్రఫీలోనూ అవార్డులు అందుకున్నాను. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్, ప్రాజెక్టులను చేశా. అప్పుడే నాకు ‘జత కలిసే’ మూవీకి సినిమాటోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. కొత్త వాళ్లందరం కలిసి ఆ సినిమా చేశాం. ఆ సినిమా తర్వాత ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ ఇలా వరసగా చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.

ఫ్యామిలీ సపోర్ట్
మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తారు. నన్ను ఎంకరేజ్ చేస్తూ.. నాకెప్పుడూ సపోర్ట్ ఇచ్చేవారు. నీకు నచ్చిన పని ఏదైనా చేసుకోమని, అందులో వంద శాతం ఎఫర్ట్ పెట్టమని చెప్పేవారు. నేను దూరదర్శన్‌లో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసినప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.

Also Read'కొత్త లోక 1: చంద్ర' రివ్యూ: వంద కోట్ల వసూళ్ళు సాధించిన ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఇండియన్ సినిమా... కల్యాణీ ప్రియదర్శన్ మూవీ ఎలా ఉందంటే?

‘అర్జున్ చక్రవర్తి’ - వర్క్ ఎక్స్‌పీరియెన్స్
ప్రజంట్ మన ఇండియాలో గొప్ప గొప్ప టెక్నీషియన్స్‌కు కొదవలేదు. హాలీవుడ్ స్థాయిలో అవుట్ ఫుట్ ఇస్తున్నాం. ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమాకు ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌‌నే వాడాం. సౌండ్, సినిమాటోగ్రఫీ ఏదైనా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టే ఉంటుంది. సినిమా సక్సెస్‌లో ఈ డిపార్ట్‌మెంట్‌ల పాత్ర చాలా ఉంటుంది. దర్శకుడి మైండ్‌తో సింక్ అవ్వాలి, అదే టైమ్‌లో ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుంది. డీఓపీ అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అంటే, అతను కూడా ఓ డైరెక్టరే. అందుకే దర్శకుడితో సింక్ అవుతూ, అతని విజన్‌ను అర్థం చేసుకోవాలి. అతనితో క్రియేటివ్ డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసినా వేస్ట్. అలా నేను ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు కూడా వచ్చేశా.

‘అర్జున్ చక్రవర్తి’ - ఎదురైన సవాళ్లు
మంచు కురిసే ప్రాంతంలో షూటింగ్ చేయడం సవాల్‌లో కూడుకున్న వ్యవహారం. ఓసారి మంచు కురిసే ప్రాంతం కావాల్సి వచ్చి కాశ్మీర్‌కు వెళ్లాం. మేము వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. మంచు కురిసే వరకు వెయిట్ చేశాం. చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వెళ్లింది. అలా మంచు కురుస్తుంటే స్వర్గమంటే ఇదేనేమో అన్నట్టుగా అనిపించింది. మేము అనుకున్న దాని కంటే కూడా బాగా షూట్ చేశాం. ఫైనల్‌గా విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. టెక్నికల్‌గా చాలా ఇబ్బంది పడ్డాం. 800 మందిని, ప్లేయర్స్‌ని టైమ్ స్లైస్ అనే ఓ పరికరంతో షూట్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ, అది అందుబాటులో లేకపోవడంతో ఫ్రీజ్‌లో పెట్టి షూట్ చేశాం. అది చాలా ఎఫెక్ట్‌ను, నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
‘అర్జున చక్రవర్తి’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు తెచ్చిపెట్టింది. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత కష్టపడ్డామో.. అంత గుర్తింపు వచ్చిందని భావించాను. దీనికి దర్శకుడు విక్రాంత్ రుద్ర, హీరోహీరోయిన్లు విజయ్ రామరాజు, సిజా రోజ్‌లతో పాటు దయానంద్ వంటి వారు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఈ జర్నీలో నిర్మాత శ్రీని గుబ్బల సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మీకేం కావాలంటే అది చేయండి కానీ.. డబ్బుని మాత్రం వృథా చేయవద్దని అనేవారు. మధ్యలో కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా.. ఆయన అండగా నిలబడ్డారు.

Also Read'పరమ్ సుందరి' రివ్యూ: కాంట్రవర్సీలకు కారణమైన బాలీవుడ్ మూవీ - మలయాళీగా జాన్వీ ఎలా నటించింది? సినిమా ఎలా ఉంది?

ఇండస్ట్రీ సపోర్ట్
సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి, ‘అర్జున్ చక్రవర్తి’ బాగుందని, అందులోనూ నా వర్క్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ అభినందించారు. నిజంగా, మనకే ఇదంతా జరిగిందా? అన్నట్టుగా ఆశ్చర్యపోయాను. థ్యాంక్స్ టు ఆల్. 

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget