Leela Vinodham Teaser: ఈటీవి విన్‌లో 'లీలా వినోదం'... ప్రసాద్ గాడి వీర ప్రేమ గాథ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈటీవి విన్ ఒరిజినల్ సిరీస్ లీలా వినోదం టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో హీరోగా నటిస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లు, సినిమాలకు స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే చాలు మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్, పాపులర్ తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ "లీలా వినోదం" అనే వెబ్ సిరీస్‌తో వీక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు ట్రీట్
మంచి కంటెంట్ తో యూట్యూబ్ ప్రేక్షకులకు దగ్గరైన షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. అందులో మరో లేడీ కంటెస్టెంట్, యూట్యూబర్ సిరితో ప్రేమాయణం నడిపి అప్పట్లో చర్చకు దారి తీశాడు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ ఎక్కడా కలిసి కన్పించలేదు. అంతే కాదు దీప్తి సునైన కూడా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, అది ముగిశాక డ్రగ్స్ వివాదంలో చిక్కున్నాడు. ఇన్ని వివాదాల మధ్య కొంత కాలం బయట కన్పించకుండా ప్రైవసీని మెయింటైన్ చేస్తున్న షణ్ముఖ్ ఇప్పుడు 'లీలా వినోదం' సిరీస్ తో అలరించడానికి రెడీగా ఉన్నాడు. పవన్ సుంకర దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో గోపరాజు రమణ, ఆమని, అనగ అజిత్, రూపలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ మారిసా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం లీలా వినోదం సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
View this post on Instagram
ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన "లీలా వినోదం" టీజర్ మొత్తం ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా సాగింది. ముందుగా "నా బెస్ట్ ఫ్రెండ్ పిఎంఆర్కే ప్రసాద్ గాడిది ఈ కథ" అనే డైలాగ్ తో మొదలైన టీజర్ చివరి వరకు ఆసక్తికరంగా అనిపించింది. అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే కథగా దీన్ని డైరెక్టర్ పవన్ సుంకర తీర్చిదిద్దినట్టుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ప్రేమించిన అమ్మాయికి ఆ విషయాన్ని చెప్పడానికి అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు ? అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అసలు అతను ప్రేమించిన అమ్మాయికి అసలు విషయాన్ని చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలియాలంటే సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో "లీలా వినోదం" స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించలేదు మేకర్స్. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.