Kotha Lokah OTT: ఓటీటీలోకి 'కొత్త లోక' - దుల్కర్ సల్మాన్ రియాక్షన్ ఇదే
Dulquer Salmaan: 'కొత్త లోక' త్వరలోనే ఓటీటీలోకి వస్తుందన్న ప్రచారాన్ని నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ ఖండించారు. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చారు.

Dulquer Salmaan Reaction On Kotha Lokah OTT Release: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హీరో ఫాంటసీ థ్రిల్లర్ 'కొత్త లోక'. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఫస్ట్ చిన్న మూవీగానే వచ్చినా ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే రూ.200 కోట్ల సినిమాగా మారింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి రూమర్స్ రాగా దానిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆ రూమర్స్ నమ్మొద్దు
'కొత్త లోక' మూవీ ఓ ప్రముఖ ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటూ పలు వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. వీటిపై రియాక్ట్ అయిన దుల్కర్ అది నిజం కాదని వెల్లడించారు. ఇప్పటికీ థియేటర్లలో మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ''కొత్త లోక' మూవీ ఏ ఓటీటీలోకి కూడా రావడం లేదు. తప్పుడు ప్రచారాలు, రూమర్లను నమ్మకండి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ కోసం వెయిట్ చేయండి.' అంటూ ట్వీట్ చేశారు.
Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry
— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025
Also Read: 'OG' ఫస్ట్ టికెట్ @ లక్షా 30 వేలు - మా పవర్ స్టార్ క్రేజ్ అంటే మామూలుగా ఉండదు
'హలో', 'చిత్రలహరి' వంటి మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ 'కొత్త లోక'తో మరోసారి అదరగొట్టారు. ప్రేమలు ఫేం నస్లెన్ నటించగా... దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, షాబిన్ షౌహిర్ అతిథి పాత్రల్లో మెరిశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తన నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ రిలీజ్ చేశారు. కేవలం మౌత్ టాక్‌తోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'కొత్త లోక'.
రూ.30 కోట్ల బడ్జెట్‌తో...
కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకూ దాదాపు రూ.270 కోట్ల గ్రాస్ వసూలు చేసనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఆ ప్లేస్‌ను మలయాళ స్టార్ మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' స్థిరంగా ఉంచుకోగా ఆ స్థానంలో 'కొత్త లోక' చేరింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ హిట్‌గా నిలిచింది.
ఓ సూపర్ పవర్స్ ఉన్న ఉమెన్ చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సాధారణ అమ్మాయిలా రెస్టారెంట్‌లో ఉద్యోగంలో చేరి బతుకుతుంది. ఆమెను సన్నీ (నస్లెన్) ఇష్టపడతాడు. ఆమె గురించి అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు చంద్రకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి?, ఆ పవర్స్ వల్ల ఆమెకు వచ్చిన ముప్పేంటి? ఆమెను అక్కడ టార్గెట్ చేసింది ఎవరు? ఆమె వందల ఏళ్లు ఎలా యవ్వనంగా బతికి ఉంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















