అన్వేషించండి

Dhoomam Telugu OTT: ధూమం తెలుగు డిజిటల్ ప్రీమియర్ - థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సినిమా

Dhoomam Telugu Digital Streaming Platform: ఫహాద్ ఫాజిల్ హీరోగా పవన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన 'ధూమం' త్వరలో తెలుగు ఓటీటీలో విడుదలవుతోంది.

Fahad Fazil's Dhoomam Movie Telugu Digital Streaming Platform and Release Date: తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్'లో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన నటనను అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! ఆయన కథానాయకుడిగా నటించిన మలయాళ థ్రిల్లర్ 'ధూమం'. త్వరలో ఈ సినిమా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి 'ధూమం' స్ట్రీమింగ్‌!
Dhoomam Telugu OTT Release On Aha: 'ధూమం' తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా తెలుగు' సొంతం చేసుకుంది. ఈ నెల (జూలై 11) నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

'కెజిఎఫ్', 'కాంతార', 'సలార్' సినిమాలతో జాతీయ స్థాయిలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థలో 'ధూమం' తెరకెక్కింది. ఆ సంస్థలో తొలి మలయాళ చిత్రమిది. విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.

'ఆకాశం నీ హద్దురా', '2018' సినిమాల ఫేమ్ అపర్ణా బాలమురళితో పాటు రోషన్ మాథ్యూ, వినీత్, అను మోహన్, అచ్యుత్ కుమార్, విజయ్ మీనన్, జాయ్ మాథ్యూ, నందు తదితరులు 'ధూమం' సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించారు.

థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి!
'ధూమం' థియేటర్లలోకి వచ్చిఏడాది దాటింది. గత ఏడాది జూన్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. అయితే, అప్పట్లో తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కాలేదు. కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. రెండు నెలల క్రితం మలయాళ వెర్షన్ సినిమాను యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. అయితే, తెలుగు వెర్షన్ రిలీజ్ మాత్రం 'ఆహా' ఓటీటీలోనే. యాపిల్ టీవీలో రెంట్ బేస్ మీద నవంబర్ నెలాఖరున అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆహా సంస్థ తమ సబ్‌స్క్రైబర్ల ముందుకు తెస్తోంది.

Also Read: మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ: మున్నా లేడు, కాలిన్ కనిపించేదీ తక్కువే - గుడ్డు గూండాగిరి హిట్టా? ఫట్టా?

'ధూమం' తర్వాత తమిళ సినిమా 'మామన్నన్'లో ఫహాద్ ఫాజిల్ నటించారు. అది తెలుగులో విడుదల అయ్యింది. మలయాళ సినిమా 'ఆవేశం' అయితే థియేటర్లలో భారీ విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత ఓటీటీలో వీక్షకులను సైతం చాలా ఆకట్టుకుంది. అందువల్ల, 'ధూమం' తెలుగు డిజిటల్ రిలీజ్ కోసం ఏపీ, తెలంగాణ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

Also Readఈటీవీ విన్ ఓటీటీ కోసం నిర్మాతగా మారుతున్న దర్శకుడు... యేలేటి నుంచి వెబ్ సిరీస్, ట్విస్ట్ ఏమిటంటే?


ఆహా ఓటీటీలో ఆకట్టుకునే సినిమాలు ఎన్నో!
ఫహాద్ ఫాజిల్ 'ధూమం' ఒక్కటే కాదు... పలు మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఆహా ఓటీటీ తెలుగు వీక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. వాటిలో ఫహాద్ ఫాజిల్ సినిమాలు సైతం ఉన్నాయి. ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన 'ప్రేమలు' తెలుగు వెర్షన్ సైతం ఆహాలో అందుబాటులో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Embed widget