అన్వేషించండి

Demonte Colony 2: ఓటీటీకి వచ్చేస్తోన్న బ్లాక్‌బస్టర్‌ హారర్‌ మూవీ 'డీమాంటీ కాలనీ 2' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కుడంటే!

Demonte Colony 2 OTT: బ్లాక్‌బస్టర్‌ హారర్‌, థ్రిల్లర్‌ చిత్రం 'డీమాంటీ కాలనీ 2' చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల చివరి నుంచి ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చేస్తోంది.

Horror Thriller Demonte Colony 2 locks OTT Release: అరుళ్ నిధి హీరోగా అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన తమిళ హార్రర్‌ చిత్రం 'డీమాంటీ కాలనీ'. 2015లో విడుదలై ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువచ్చారు. ఆగస్ట్‌ 15న తమిళంలో, ఆగస్ట్‌ 23న తెలుగులో ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. రిలీజైన రెండు భాషల్లోనూ ఈ మూవీ మంచి విజయం సాధించింది.

వెన్నులో వణుకుపుట్టించే హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 55 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee5) ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని దక్కించుకుంది. ఇప్పుడు డీమాంటీ కాలనీ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నేడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది ఈ సంస్థ. సెప్టెంబ‌ర్ 27 నుంచి తెలుగు, తమిళ్‌ భాషలో 'డీమాంటీ కాలనీ' విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది జీ5. 

కథేంటంటే

కాగా థియేటర్లో డీమాంటీ కాలనీ 2 సస్పెన్స్‌, హారర్‌ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు వెన్నులో వణుకుపుట్టించే అనుభవాన్ని గురించింది. శాపానికి గురై ఓ బంగారు గొలుసును దొంగ‌లించ‌టానికి కొంత‌మంది స్నేహితులు ప్ర‌య‌త్నిస్తారు. ఆ గోలుసును ముట్టుకోవడతో నిద్రావ‌స్థ‌లోని భ‌యంక‌ర‌మైన ఆత్మ మేల్కొంటుంది. ఆ దుష్ట ఆత్మ ప్ర‌తీకార చ‌ర్య నుంచి త‌మ స్నేహితుల‌ను కాపాడుకోవ‌టానికి మిగతా స్నేహితులు ఏకం అవుతారు. మరి ఆ ఆత్మను వారు ఎలా కట్టడి చేశారు, ఈ క్రమంలో వారికి ఎదురైన భయంకర అనుభవాలను డైరెక్టర్‌ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం చక్కగాచూపించారు. 2015లో విడుదలై ఘన  ఘ‌న విజ‌యం సాధించిన‌ 'డీమాంటీ కాలనీ'కి కొన‌సాగింపుగా రూపొందిన 'డీమాంటే కాలనీ 2'ముందు చిత్రాన్ని మించేలా ఆస‌క్తిక‌ర‌మైన హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాల‌తో తెర‌కెక్కింది.

అంతే కాకుండా తొలి భాగం కంటే కూడా భ‌యానక‌మైన స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన జీ5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ.. సౌత్ ఇండియ‌న్ కంటెంట్‌కు ZEE5లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుందన్నారు. ఈ క్ర‌మంలో ‘డీమాంటీ కాలనీ 2’ వంటి హార‌ర్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామని, తొలి భాగాన్ని మించిన వైవిధ్య‌మైన అంశాల‌తో, హార‌ర్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందన్నారు.

సౌత్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోన్న క్ర‌మంలో ZEE5 ప్రేక్ష‌కుల‌కు హార‌ర్ చిత్రం డీమాంటీ కాల‌నీ 2 చిత్రాన్ని అందించ‌టం ఆనందంగా ఉందని, త‌ప్ప‌కుండా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందన్నారు. ద‌ర్శ‌కుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు మాట్లాడుతూ.. థియేటర్‌లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం 'డీమాంటే కాలనీ 2' ఇప్పుడు జీ 5 ఓటీటీలోకి వస్తుంది. థియేటర్లో మా సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన స్పంద‌న చూసి గొప్ప‌గా అనిపించింది. ఇప్పుడు జీ5 వంటి ఓటీటీ ద్వారా మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా రీచ్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు" అన్నారు. 

Also Read: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget