![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ant Man 3 OTT Release : హాట్‌స్టార్‌లో 'యాంట్ మ్యాన్ 3' - రిలీజ్ ఆ రోజేనా?
Ant-Man and the Wasp: Quantumania OTT Release Date : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో తాజా సినిమా 'యాంట్ మ్యాన్ 3'. నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల కానుందంటే?
![Ant Man 3 OTT Release : హాట్‌స్టార్‌లో 'యాంట్ మ్యాన్ 3' - రిలీజ్ ఆ రోజేనా? Ant-Man and the Wasp Quantumania OTT Release Ant Man 3 Expected To Stream from April 5, 2023 Ant Man 3 OTT Release : హాట్‌స్టార్‌లో 'యాంట్ మ్యాన్ 3' - రిలీజ్ ఆ రోజేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/17/4ca4be66a7eada9e17afa25329f262541676616939161313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'యాంట్ మ్యాన్' ఫ్రాంచైజీలో మూడో సినిమా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో 31వ సినిమా 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' ఈ రోజు (ఫిబ్రవరి 17న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల అవుతుంది? అంటే...
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో...మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన సినిమాలు అన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అవుతుంటాయి. ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు. 'యాంట్ మ్యాన్ 3' కూడా ఆ ఓటీటీలోనే విడుదల కానుంది. ఓటీటీలో విడుదల తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు. కానీ, ఇంతకు ముందు ట్రాక్ రికార్డ్ చూస్తే నెలన్నరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఏప్రిల్ 5న విడుదల చేస్తారా?
మార్వెల్ స్టూడియోస్ కొత్త సినెమా థియేటర్లలో విడుదల అయ్యే సమయంలో... దాని కంటే ముందు వచ్చిన సినిమాను ఓటీటీలో విడుదల చేయడం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అలవాటు. అలాగే, థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తుంది.
'గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3'ను మే 5న విడుదల చేయాలని మార్వెల్ స్టూడియోస్ ప్లాన్ చేస్తోంది. అందువల్ల, 'యాంట్ మ్యాన్ 3'ను ఏప్రిల్ 5న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని హాలీవుడ్ టాక్.
Also Read : యాంట్ మ్యాన్ మూడో సినిమా ఎలా ఉంది? కొత్త సూపర్ విలన్ ఆకట్టుకున్నాడా?
'యాంట్ మ్యాన్ 3'లోనూ టైటిల్ పాత్రలో పాల్ రూడ్ (Paul Rudd) నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. విలన్ కింగ్ ది కాంకరర్ పాత్రలో నటించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) నటించారు. ఆయన బాగా నటించాడని చాలా మంది పేర్కొంటున్నారు. ఆయనకు ఓటు వేశారు. కానీ, సినిమా బాలేదని పేర్కొంటున్నారు. విలన్ యాక్టింగ్ ఒక్కటే బావుందని కొందరు పేర్కొనడం గమనార్హం. ఈ సినిమాకు విమర్శల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?
Ant-Man 3 becomes second rotten film in MCU : సినిమా చూసిన తర్వాత 'రొట్టెన్ టమాటోస్ సైట్'లో ప్రేక్షకులు రివ్యూలు ఇస్తూ ఉంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాల్లో 'యాంట్ మ్యాన్ 3' రెండో చెత్త సినిమాగా రికార్డులకు ఎక్కింది. సినిమా బాలేదని పలువురు పేర్కొన్నారు. దాంతో విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీని కంటే ముందు... మొదటి స్థానంలో 'ఎటర్నల్స్' చెత్త సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఆ ఫన్ ఎక్కడ? ఎమోషన్ ఏది??
విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ... ఆ పాత్రలో జోనాథన్ మెజర్స్ బాగా చేసినప్పటికీ... సినిమాలో కామెడీ మిస్ అయ్యిందని సినిమా చూసిన వాళ్ళలో మెజారిటీ జనాలు చెప్పే మాట. 'యాంట్ మ్యాన్' ఒకటి, రెండు సినిమాల్లో ఫన్, హ్యూమర్ 'యాంట్ మ్యాన్ 3'లో లేదని చెబుతున్నారు. ఎమోషన్ కూడా మిస్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. ఏదో త్వరగా సినిమాను ముగించిన ఫీలింగ్ కలిగిందని కొందరు పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)