అన్వేషించండి

Anjali : బోల్డ్ సీన్స్‌పై నటి అంజలి బోల్డ్ కామెంట్స్- కానీ తప్పదంటూ నిట్టూర్పు

Anjali Hot: జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న బహిష్కరణ వెబ్‌సీరిస్‌లో హాట్‌ అందాలతో అంజలి అదరగొట్టింది. బోల్డు సీన్లతో యువతను పిచ్చెక్కించింది. ఇలాంటి సీన్లలో నటించడం కష్టంగానే ఉంటుందని అంజలి తెలిపింది.

Bahishkarana Web Series: సాధారణ పాత్రల్లో నటించినంత ఈజీగా శృంగారపాత్రలో నటించలేమని నటి అంజలి(Anjali) అన్నారు. పాత్రపరంగా ఇబ్బందిలేకపోయినా ఇంటిమేట్‌స్ సీన్స్‌ వ్యక్తిగతంగా కొంత ఇబ్బందేనని చెప్పుకొచ్చారు.

కెమెరా ముందు శృంగారం ఈజీకాదు
కుటుంబ కథా చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి(Anjali)..అవకాశాలు తగ్గిపోవడంతో ఓటీటీల(OTT) వైపు మొగ్గు చూపారు. షాపింగ్‌మాల్‌, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సూపర్‌డూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న అంజలికి వరుస అవకాశాలు క్యూకట్టాయి. బాలకృష్ణ(Balakrishna), రవితేజ(Raviteja) వంటి సీనియర్‌ నటుల సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలోనే అల్లుఅర్జున్ పక్కన ఓ ఐటెంసాంగ్‌లో అదరగొట్టింది. ఆ తర్వాత అవకాశాలు మెల్లగా తగ్గిపోవడంతో ఓటీటీల్లో వెబ్‌సీరిస్‌ల్లో(Web Series) నటిస్తోంది. ఇప్పటికే మూడు తమిళ్ వెబ్‌సీరిస్‌లో చేసిన అంజలి తెలుగులోనూ రెండు సీరిస్‌ల్లో నటించింది. ఇటీవలే జీ-5(Zee-5)లో స్ట్రీమింగ్‌ అయిన బహిష్కరణ(Bahiskarana) వెబ్‌సీర్‌స్ సూపర్‌డూపర్ హిట్‌ అయ్యింది. ఈ సిరీస్‌లో పుష్ప(Puspa) అనే వేశ్య పాత్రలో అంజలి హాట్‌హాట్‌గా నటించింది. ట్రైలర్‌ విడుదలవ్వగానే వెబ్‌సీరిస్‌పై అంచనాలు భారీగా పెరిగిపోగా...స్ట్రీమింగ్(Streming) అయిన వెంటనే అత్యధిక వ్యూస్‌ టైమింగ్‌తో దూసుకుపోతోంది. తొలి మూడురోజుల్లోనే మూడున్నర కోట్ల వ్యూయింగ్ నిమిషాలు దాటేసింది. అంజలి ప్రధాన పాత్రగా సాగిన ఈ వెబ్‌సీరిస్‌లో అంజలి అందాలు ఆకట్టుకున్నాయి. 

లేడీ పుష్పగా అదరగొట్టిన అంజలి
సినిమాల కన్నా ఇప్పుడు వెబ్‌సీరిస్‌లకే ఆదరణ ఎక్కువ లభిస్తోంది. వెంకటేశ్‌లాంటి సీనియర్‌ నటుడు కూడా రానానాయుడులో నటించి ఔరా అనిపించాడు. సినిమాతో పోల్చితే వెబ్‌సీరిస్‌లకు సెన్సార్‌ అవసరం లేకపోవడంతో ఎలాంటి కంటెంట్‌ అయినా  ఎంతమేరకు అయినా ఇవ్వొచ్చు. ఇదే వెబ్‌సీరీస్‌లు హిట్‌ అవ్వడానికి అసలు కారణం శృంగారం మోతాదు పెరిగినా, బోల్డు సీన్లు ఉన్నా ఇబ్బంది లేదు. పైగా నిడివి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంత ఫుటేజ్‌ ఉన్నా పర్వాలేదు. అందుకే అంజలి(Anjali) కాస్త జులు విదిల్చింది. ముద్దు సీన్లు దగ్గర నుంచి బెడ్‌ సీన్లు వరకు ఎక్కడా ఎలాంటి మోహమాటం లేకుండా నటించింది. తన హస్కీ చూపులు, డైలాగ్‌లతో కుర్రకారు మతిపోగొట్టింది. అసలే గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ కావడం, అందులోనూ ఆమె నటించింది ఊరు చివరన ఉండే వేశ్య పాత్ర కావడంతో మోతాదు పెంచేసింది. హాట్‌హాట్‌ అందాలతో మత్తెక్కించింది. ఇదే ఈ వెబ్‌సీరిస్ హిట్‌ కావడానికి అసలు కారణం. తన కవ్వింపు మాటలు, నవ్వులు, చూపులతో సీరిస్ వ్యూస్ పెంచేసింది.

శృంగార సీన్లతో ఇబ్బందే
బహిష్కరణ వెబ్‌సీరీస్ హిట్‌ అవ్వడంతో యూనిట్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంజలిని కొందరు ప్రశ్నించారు. శృంగార సన్నివేశాల్లో నటించేప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించదా అని అడగారు. దీనికి ఆమె సమాధానం చెబుతూ...స్క్రీన్‌మీద కనిపించేంత ఈజీ కాదు నటించడమంటే అంటూ ఓ నిట్టూర్పు విడిచింది. చుట్టూ పదిమంది మగాళ్లు వారి ముందే నటించాల్సిరావడం కొంచెం ఇబ్బందేనని చెప్పింది. పైగా స్క్రీన్‌పై ఆ ఇబ్బంది కనిపించకుండా జాగ్రత్తపడాలని చెప్పుకొచ్చింది. పుష్ప పాత్ర పరంగా అలాంటి సీన్స్‌ నటించడం ఇబ్బంది లేకున్నా...వ్యక్తిగతంగా కొంచె ఇబ్బందికరమేనని చెప్పుకొచ్చారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు ముందు అవన్నీ దిగదుడుపేనన్నారు. ఆమె కోస్టార్‌ రవీంద్ర విజయ్‌మాత్రం ఇలాంటి సీన్లు చేసే ముందు కచ్చితంగా రిహాల్స్‌ చేసిన తర్వాతే చేస్తామని చెప్పారు. ఎవరు ఎంతవరకు ఉండాలి..ఎక్కడెక్కడ పట్టుకోవాలి. ఎంత దూరంలో ఉండి నటించాలన్నది ముందుగానే రిహార్సల్స్ చేసిన తర్వాత అసలు సీన్‌లోకి ఎంట్రీ అవుతామన్నారు. అయితే ఈ సీరిస్‌లో అంజలి కేవల్‌ బోల్డ్‌ సీన్స్‌లో కాదు...ఎమోషనల్‌ సీన్లలోనూ కంటతడిపెట్టించారు. క్లైమాక్స్‌ సీన్‌లో అయితే శివతాండవమే ఆడింది. మొత్తంగా బహిష్కరణ సీరిస్‌ అయిపోయేసరికి అంజలి నటించిన పుష్పపాత్రపై మనం మనసుపారేసుకోవడం ఖాయం.

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget