Allu Arjun On OTT: ‘ఆర్య’, ‘ఇద్దరమ్మాయిలతో’ to ‘పుష్ప’ - అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
Allu Arjun Hit Movies: 'పుష్ప'కు ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు. పుష్ప తర్వాత వేరు. ఇప్పుడు ఆయనది ఇంటర్నేషనల్ లెవల్. మరి, 'పుష్ప'కు ముందు ఆయన చేసిన సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
Allu Arjun Movies streaming on OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు హిందీ, మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ కావడంతో ఆయన అక్కడి వారికీ బాగా పరిచయమయ్యారు. మలయాళంలో ఆయనను ‘మల్లు అర్జున్ ’ అని పిలుస్తారు అక్కడి ఫ్యాన్స్. ఇక, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. 'పుష్ప'కు ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు. పుష్ప తర్వాత వేరు. ఇప్పుడు ఆయనది ఇంటర్నేషనల్ లెవల్. ‘పుష్ప 2’ ఫీవర్ నడుస్తోంది కాబట్టి, అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూడండి.
చివరి లోకల్ సినిమా కానీ సూపర్ హిట్!
2020 సంక్రాంతి కి విడుదలై, థియేటర్లలో బంపర్ హిట్ అయిన సినిమా ‘అలవైకుంఠపురంలో’. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా కరోనా సమయంలో ఓటీటీల ద్వారా మరింతగా చేరువైంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కు చివరి రీజనల్ సినిమాగా చెప్పవచ్చు. ‘పుష్ప 1’తో పాన్ ఇండియా జోన్ లోకి అడుగుపెట్టేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాలోని త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాట్ ఫేవరెట్ గా మ్యూజిక్ లవర్స్ కు హాట్ ఫేవరెట్ గా నిలిచాయి. తెలుగు తో పాటు మలయాళ, తమిళ భాషల్లో అందుబాటులో ఉందీ సినిమా.
బన్నీని 'ఫ్యామిలీ స్టార్'ను చేసిన సినిమా
ఇంట్లో అమ్మాయి ప్రేమించిన వాడితో వెళిపోతే.... తప్పేం కాదంటారు లవర్స్ . కానీ ఆ అమ్మాయి కుటుంబం చితికిపోతుంది. ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘పరుగు’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రైమ్ వీడియో లో చూడవచ్చు.
రామ్ చరణ్ సినిమాలో అతిథిగా...
అల్లు అర్జున్ తొలిసారిగా ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘ఎవడు’. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు కాజల్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా అందుబాటులో ఉంది.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
పాన్ ఇండియా స్టార్ అయిపోయారు
మరి కొద్ది గంటల్లో పుష్ప 2 థియేటర్లలోకి వచ్చేస్తోంది. పుష్ప తొలి భాగం విడుదలై, మూడేళ్లు కావస్తోంది. సినిమాలోని పాత్రలూ, కథాకథనాలు మన మెమరీ లోంచి లైట్ గా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎర్ర చందనం కూలీ స్థాయి నుంచి స్మగ్లర్ వరకూ ఎలా ఎదిగాడో, దారిలో ఉన్న అడ్డుంకుల్ని ఎలా దాటాడో అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉన్న ‘పుష్ప ద రైజ్’ ను లుక్కేయండి. తెలుగు తో పాటు కన్నడ, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఇద్దరమ్మాయిలతో (హిందీ)
బన్నీ (తెలుగు)
డిస్నీ హాట్ స్టార్
జులాయి (తెలుగు)
ఎవడు (తెలుగు)
దువ్వాడ జగన్నాథమ్ (డీజె) (తమిళం, బెంగాలీ, కన్నడ) -‘డీజె’ తెలుగు సినిమా నిర్మాత ‘దిల్’ రాజు అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ఒరిజినల్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
ఎవడు (తమిళం)
ఆహా తెలుగు
వరుడు (ఆహా ప్రీమియమ్)
పరుగు (ఆహా తెలుగు)
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?