Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క
Unstoppable Season 2 Update : నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్'కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నట్లు సమాచారం.
![Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క Actor Prabhas Gopichand to Appear in Balakrishna's Unstoppable 2 Shoot As Planned On Dec 11th Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/02/f9e0f99acb301bed97483929bd0d987d1669970340994313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... అన్నట్టు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' (Unstoppable) సెకండ్ సీజన్ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోకి వచ్చిన గెస్టులు ఓ లెక్క. ఇప్పుడు రాబోయే గెస్టులు మరో లెక్క. పాన్ ఇండియా లెవల్ హీరో వస్తున్నారు.
బాలయ్యతో ప్రభాస్ & గోపీచంద్
'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు లేదా ముగ్గురు గెస్టులను తీసుకు వస్తున్నారు. ఈసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) వస్తున్నారట. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.
సాధారణంగా ప్రభాస్, గోపీచంద్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. కానీ, బాలకృష్ణ కోసం వస్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరి స్నేహం గురించి బాలయ్య ఎన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పిస్తారో చూడాలి. ఈ నెల 11న ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలిసింది. బహుశా... ఆ తర్వాత వచ్చే గురువారం లేదంటే క్రిస్మస్ కానుకగా ఆ ఎపిసోడ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్‌లో నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలతో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్‌లను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్‌లో గెస్టులు నలుగురు అని ఈ రోజు స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు (D Suresh Babu), అల్లు అరవింద్ (Allu Aravind)తో పాటు దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చారు. తెలుగు సినిమా 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. తెలుగు చిత్రసీమలో దిగ్గజ దర్శక నిర్మాతలతో ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలాగే, బాలకృష్ణ మార్క్ హ్యూమర్ కూడా ఉంటుందని టాక్.
''తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని లెజండరీ దర్శకులు, నిర్మాతలతో లెజెండ్ నందమూరి బాలకృష్ణ... ఈ వారం 'అన్‌స్టాపబుల్'లో! డిసెంబర్ 2 నుంచి ఐదో ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది'' అని 'ఆహా' ఓటీటీ సోషల్ మీడియాలో పేర్కొంది.
ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ పొలిటికల్ పరంగానూ డిస్కషన్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్ కూడా! ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు. యువ హీరోలతో కలిసి విపరీతంగా సందడి చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)