RRR In Oscars 2023 : సరికొత్త చరిత్ర మరికొద్ది గంటల్లో... తుది జాబితాలో 'ఆర్ఆర్ఆర్' ఉంటుందా?
మరికొద్ది గంటల్లో RRR ఆస్కార్ ఫలితం... తుది నామినేషన్స్ ఫలితాలపై ఉత్కంఠ! నాటు నాటు పాటతో గోల్డెన్ గ్లోబ్ కొట్టిన RRR... ఆస్కార్ తుదినామినేషన్స్ లో పక్కా అని అంచనా!
![RRR In Oscars 2023 : సరికొత్త చరిత్ర మరికొద్ది గంటల్లో... తుది జాబితాలో 'ఆర్ఆర్ఆర్' ఉంటుందా? Oscar 2023 Will Rajamouli's RRR Creates History For Nominating Naatu Naatu Song for Best Original Song RRR In Oscars 2023 : సరికొత్త చరిత్ర మరికొద్ది గంటల్లో... తుది జాబితాలో 'ఆర్ఆర్ఆర్' ఉంటుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/104241203c99f1d9dcd9e1709fb0cc481674565478643313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మరికొద్ది గంటల్లో ఫలితం తేలిపోతుంది. 2017లో మొదలైన RRR ప్రయాణం ఇప్పుడు ఆస్కార్ తుది పోరులో ఉంటుందా? ఉండదా? ఈ ఒక్క ప్రశ్న వరకూ వచ్చేసింది. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అసలు టైటిల్ ఏంటో కూడా తెలియకుండానే జస్ట్ వాళ్ల వాళ్లకున్న బ్రాండ్ ఇమేజ్ తో మొదలైపోయిన సినిమా... కొవిడ్ కారణంగా రెండేళ్లు ఆలస్యంగా గతేడాది విడుదలైన ఆ క్షణం నుంచి ఎన్నో రికార్డులు... సరికొత్త చరిత్రలు.
రాజమౌళి విజన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల అద్భుతమైన నటన ఇవన్నీ కలగలిసి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఏదో మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యలోనో... కూకట్ పల్లి భ్రమరాంబలోనో... వైజాగ్ జగదాంబలో కుర్రోళ్లు గెంతుతున్నట్లు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారంటే అదే అన్నింటింకంటే పెద్ద అవార్డు సినిమాకు. వెస్ట్రన్ రిగ్నైజేషన్ అని కాదు కానీ ఆస్కార్ తుదిపోరులో ఆ ఫైనల్ నామినేషన్ లో ఒక్క విభాగంలోRRR నిలిచినా ఈ ఐదున్నరేళ్ల జక్కన్న అండ్ కష్టానికి సంపూర్ణత్వం వచ్చినట్లే.
అసలు ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా ఆస్కార్ మెయిన్ క్యాటగిరీల్లో పోటీపడలేదు. మదర్ ఇండియా నుంచి లగాన్ వరకూ అన్నీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో పోటీపడినవే తప్ప అమెరికాలో ఆడించి సినిమాను సబ్మిట్ చేసినవి కాదు. RRR ఆ పని చేసింది. ఇండియాలో తనకున్న క్రేజ్ ను సరైన దిశలో వాడుతూ అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు రాజమౌళి. 'నాటు నాటు...' సాంగ్ అయితే గోల్డెన్ గ్లోబ్ నూ కొట్టేసి ఆస్కార్ నా తర్వాత లక్ష్యం అని సగర్వంగా నిలబడింది. బెస్ట్ యాక్టర్ విభాగంలోనూ నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ ల కష్టం కనిపిస్తుందేమోనని చిన్న హోప్. అంతర్జాతీయ పత్రికలైతే వీరిద్దరిలో ఒకరికి నామినేషన్ పక్కా అని ప్రెడిక్షన్స్ చెప్పాయి.
Also Read : నందమూరి అందగాడితో చందమామ - ఇది ఫైనల్!
పోనీ యాక్టింగ్, డైరెక్షన్, సినిమా ఇవన్నీ పక్కన పెట్టండి. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ నామినేషన్ రావటం పక్కాగా కనిపిస్తోంది. కారణం ఆల్రెడీ ఆ పాట గోల్డెన్ గ్లోబ్ విన్నర్. హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇచ్చిన టాప్ గన్, రిహానా పాటలు పాడిన బ్లాక్ పాంథర్ లను దాటి గోల్డెన్ గ్లోబ్ కొట్టింది కీరవాణి బాణీలు అందించిన నాటు నాటు సాంగ్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ వరల్డ్ వైడ్ అటెన్షన్ ను డ్రా చేసింది. సో ఈ విభాగంలో అయితే ఆస్కార్ నామినేషన్ పక్కా అని అందరూ చెబుతున్నారు. దీనిపైన ఏ విభాగంలోనైనా RRR నామినేషన్ దక్కించుకుంటే అది బోనస్ అనే చెప్పాలి. సీరియల్ తీసుకునే ఓ డైరెక్టర్ గా మొదలైన రాజమౌళి అనే విజనరీ ప్రస్థానం ఇప్పుడు జేమ్స్ కేమరూన్ రివ్యూ చెప్పేంత స్థాయికి చేరుకున్న దానికి ప్రతిఫలం ఈ ఆస్కార్ నామినేషన్స్ తో దక్కినట్లవుతుంది. Lets Hope. RRR సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. RRR ఆస్కార్ జర్నీపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి.
Also Read : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)