Hunt Movie - Mumbai Police : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ నిర్మించిన 'హంట్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది 'ముంబై పోలీస్' రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దానికి సుధీర్ బాబు స్పందించారు.
'ముంబై పోలీస్'... మలయాళంలో పదేళ్ళ క్రితం, 2013లో వచ్చిన సినిమా. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. ఇప్పుడు ఆ సినిమా పేరు తెలుగులో విపరీతంగా వినబడుతోంది. ఎందుకు? అంటే... 'హంట్'.
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'హంట్' (Hunt Movie). హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని యూనిట్ చెబుతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ మాత్రమే కాదని, సినిమాలో ఎమోషన్ కూడా ఉందని చెబుతున్నారు. అది పక్కన పెడితే... మలయాళ 'ముంబై పోలీస్' (Mumbai Police Movie) కు 'హంట్' రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. సుధీర్ బాబు ముందు ఆ విషయం ఉంచగా... ఆయన స్పందించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న 'హంట్' విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. ''మీ సినిమా 'ముంబై పోలీస్' రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. నిజమేనా? ఆ సినిమాకు, మీ సినిమాకు సిమిలారిటీస్ ఉంటాయా?'' అని అడిగితే... ''ఒక్క 'ముంబై పోలీస్' అని కాదు, 'హంట్'కు చాలా ఇన్‌స్పిరేషన్స్ ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో మీరే చెప్పాలి'' అని సుధీర్ బాబు సమాధానం ఇచ్చారు. అదీ సంగతి!
ప్రతి హీరో ఇటువంటి సినిమా చేయలేరు!
'హంట్' సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. తనకు కాన్ఫిడెన్స్ ఉందన్నారు. ప్రతి హీరో ఇటువంటి సినిమా చేయలేరని ఆయన చెప్పుకొచ్చారు. కథ, హీరో క్యారెక్టర్, సినిమా కాన్సెప్ట్ పరంగా రిస్క్ చేశానని ఆయన తెలిపారు. అయితే... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కలిగిందన్నారు. అయితే... సినిమాలో ట్విస్ట్ ఏంటనేది మాత్రం ఆయన చెప్పలేదు. 'హంట్' చేయడం రిస్క్ అనుకోలేదన్నారు.
కృష్ణ గారు ఇచ్చిన ధైర్యంతో 'హంట్' చేశా!
'హంట్' చేయడానికి ఓ విధంగా కృష్ణ గారు కారణమని సుధీర్ బాబు చెప్పారు. సుమారు 350కు పైగా సినిమాలు చేసిన సూపర్ స్టార్, కెరీర్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేశారని, కొత్త కాన్సెప్ట్ సినిమాలను ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని... తాను 'హంట్' చేయడానికి ఆయన చూపిన మార్గమే కారణమని చెప్పారు.
Also Read : పాటలు లేకున్నా 'ఖైదీ' చూశారుగా... 'విక్రమ్'లో హీరోయిన్ లేదుగా - 'హంట్' దర్శకుడు మహేష్ ఇంటర్వ్యూ
'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్లా, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ (హాలీవుడ్) , స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.
Also Read : 'గజినీ' టైపులో 'హంట్' ఉంటుందా? - ఇదిగో మహేష్ క్లారిటీ