By: ABP Desam | Updated at : 24 Jan 2023 05:22 PM (IST)
కాజల్ అగర్వాల్, బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు జోడీగా నటించబోయే అందాల భామ ఎవరు? అనిల్ రావిపూడి సినిమాలో కథానాయిక ఎవరు? బాలయ్యతో ఈసారి ఎవరు జోడీ కడతారు? - ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది.
నందమూరి అందగాడితో తెలుగు తెర చందమామ జోడీ కడుతోంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది.
Also Read : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?
బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా తొలుత హిందీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఓ దశలో ప్రియాంకా జవాల్కర్ పేరు బలంగా వినిపించింది. ఆమెకు ఆడిషన్, లుక్ టెస్ట్ కూడా చేశారు. దాదాపు ఆమెను ఫైనలైజ్ చేశారని కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... ఎందుకో చివరి క్షణంలో ఆమె చేతిలో నుంచి అవకాశం చేజారింది.
Also Read : పాటలు లేకున్నా 'ఖైదీ' చూశారుగా... 'విక్రమ్'లో హీరోయిన్ లేదుగా - 'హంట్' దర్శకుడు మహేష్ ఇంటర్వ్యూ
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 వర్కింగ్ టైటిల్ పెట్టారు. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు.
ఎన్‌బికె 108లో శరత్ కుమార్!
వినోదంతో పాటు వాణిజ్య విలువలు జోడించి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూడా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో ఆయన కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ, శరత్ కుమార్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరక్కించినట్టు నిర్మాతలు తెలిపారు.
శ్రీలీల క్యారెక్టర్ ఏంటి?
తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి', లేటెస్ట్ మాస్ మహారాజా రవితేజ హిట్ 'ధమాకా' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. అయితే, ఆమె ఎవరి కుమార్తెగా నటిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్!
ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... లేటెస్ట్ హ్యాట్రిక్ ఇది.
Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?
Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?
Brahmamudi Serial February 2nd: స్వప్న బుట్టలో పడిపోయిన రాజ్- కనకం గుట్టు తెలుసుకున్న రుద్రాణి
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన
Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam