Vettaiyan : ‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
రజనీకాంత్ సినిమా అంటే మామూలు హడావిడి ఉండదు. ఆయన అభిమానులకు పండగే పండుగ. ‘వేట్టయాన్’ రిలీజ్ సందర్భంగా ఏకంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించడం విశేషం.
Rajinikanth’s Vettaiyan Release: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏడు పదుల వయసు దాటినా, తన మార్క్ నటన, మేనరిజంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఎంత మంది నటులున్నా రజనీ స్టైల్ కు పడిపోని ప్రేక్షకులు ఉండరు. అలాంటిది రజనీ సినిమా విడుదల అంటే ఇంక ఎలా ఉంటుంది? థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, తమిళనాడు సినీ లవర్స్ లో కొత్త జోష్ వస్తుంది. తాజాగా ‘వేట్టయాన్’ ఫీవర్ పలు కంపెనీలకు పాకింది. సూపర్ స్టార్ సినిమా రిలీజ్ సందర్భంగా ఏకంగా తమ ఉద్యోగులకు పే హాలీడే ప్రకటించాయి. రజనీకాంత్ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాయి. ఆయా కంపెనీలు తీసుకున్న నిర్ణయం పట్ల ఎంప్లాయీస్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలైవా మూవీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్…
థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకులు
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ సహా పలువురు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా ఇవాళ (అక్టోబర్ 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు జ్ఞానవేల్ జర్నలిస్టుగా పని చేస్తున్న రోజుల్లో జరిగిన ఓ ఎన్ కౌంటర్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా పలు భాషల్లో విడుదల అయ్యింది.
‘వేట్టయాన్’ గురించి ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
రజనీకాంత్, టీజే జ్ఞానవేల్ కాంబోలో వచ్చిన ‘వేట్టయాన్’ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెల్లవారు జామున 4 గంటల నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు ఇస్తున్నారు. ‘వేట్టయాన్’ ఫస్టాఫ్ అద్భుతంగా ముందుకు సాగిందంటున్నారు. ‘స్క్రిప్ట్ కూడా వంకపెట్టడానికి లేదంటున్నారు. “సోషల్ మెసేజ్ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశాన్ని దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆహా అనిపిస్తుంది. రజనీకాంత్, బిగ్ బీ, ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయి నటించారు. కామెడీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫస్ట్ భాగం చాలా బాగున్నా, రెండో భాగం విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డారు. సినిమా కాస్త స్లో అయిన భావన కనిపించింది. కాస్త సినిమాను స్పీడప్ చేస్తే బాగుండేది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనురుధ్ తన మార్క్ బీజీఎంతో సినిమా ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమా ఫర్వాలేదు అనిపించేలా ఉంది” అంటున్నారు ప్రేక్షకులు.
தலைவர் படம் ரிலீஸ் னாலே இது மாறி அலப்பறை எல்லாம் சர்வ சாதாரணம்ப்பா 😂#Vettayain pic.twitter.com/P5lIegQCw9
— Tiger Siva🐅 (@ssrkarr) October 9, 2024