Actress Suicide: యువనటి ఆత్మహత్య, సహజీవనం చేసిన వ్యక్తే కారణమంటున్న తల్లిదండ్రులు
Actress Suicide: యువనటి ఆత్మహత్య, సహజీవనం చేసిన వ్యక్తే కారణమంటున్న తల్లిదండ్రులు
Rashmi Rekha Died: ఒడిశాకు చెందిన బుల్లితెర నటి రష్మిరేఖా ఓజా. ఎన్నో సీరియళ్లలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఒడిశాలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమె హఠాత్తుగా భువనేశ్వర్ లోని నాయపల్లి ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసులు అధికారులు సూచించారు. ఆమెకు 23 ఏళ్ల వయసు. ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. దీంతో ఈ కేసును ఆత్మహత్యగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెకు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఏమొచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
సహజీవనం...
రష్మిరేఖా నాయపల్లి అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ యజమాని పోలీసులతో మాట్లాడారు. రష్మి, సంతోష్ అనే మరొక యువకుడు కలిసి తాము భార్యాభర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. వారిద్దరూ సహజీవనం చేసినట్టు గుర్తించారు పోలీసులు. రష్మి తల్లిదండ్రులకు ఆమె మరణించిన సంగతి ఫోన్ చేసి చెప్పింది కూడా సంతోషే. దీంతో తల్లి దండ్రులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కెరీర్ పరంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ కూతురి చావుపై అనుమానాలు ఉన్నట్టు చెప్పారు. సహజీవనం చేసిన సంతోష్ వల్లే తమ బిడ్డకు ఆ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. సూసైడ్ నోట్లో ‘ఐ లవ్ యూ సాన్’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. సాన్ అంటే సంతోష్ అనే భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సంతోష్‌ను, తల్లిదండ్రులను, స్నేహితులను విచారిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముందు రోజే అన్నీ మార్చి...
రష్మి రేఖ ఆత్మహత్యకు ఒక్క రోజు ముందే సోషల్ మీడియాలో ఖాతాలో ఫోటోలను మార్చింది. ఫేస్ బుక్ డిపీ, కవర్ పిక్ మార్చింది. ఇన్ స్టాలో కూడా అందమైన డిపీని పెట్టింది. ఈలోపే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలోకూ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also read: బాలయ్యతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రకటించిన ఆహా టీమ్, ఎప్పట్నించంటే
Also read: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్