Leo Kalyan: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్
సోనమ్ కపూర్‌తో ఫోటోలు పెట్టడంతో లియో కళ్యాణ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
![Leo Kalyan: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్ Leo Kalyan trolls a lot after posting photos with Sonam, says he doesn't care about hate comments Leo Kalyan: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/6dae350432c09bde03b52b90043deb9d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సీమంతం లండన్లో జరిగింది. ఆ వేడుక ఫోటోలను లియో కళ్యాణ్ అనే వ్యక్తి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశాడు. అందులో సోనమ్‌తో పాటూ అతనూ ఉన్నాడు.కాకపోతే చాలా భిన్నమైన వస్త్రాధారణతో కనిపించడంతో అతని ఫోటోలు వైరల్‌గా మారాయి.ఆ ఫోటోల్లో అతడిని చూసిన వారు చాలా నెగిటివ్ కామెంట్లు చేశారు. వాటిని లియో కళ్యాణ్ స్పందించాడు. సోనమ్ తో కలిసి ఉన్న వీడియోలను, ఫోటోలను పోస్టు చేశాక అతను ఎదుర్కొన్న పరిస్థితులను ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీస్ లో పంచుకున్నారు.
‘ద్వేషపూరిత కామెంట్లు నన్ను ఏమాత్రం బాధించవు. వాటిలో కొన్ని చాలా ఫన్నీ కామెంట్లు ఉన్నాయి. వాటిని చూసి నేను, నా స్నేహితులు నవ్వుకుంటాము. నేను వ్యక్తులు పెట్టుకున్న నియమనిబంధనలను, సామాజిక నిబంధనలను సవాలు చేస్తున్నట్టు జీవిస్తున్నాను... అంటే నేనేదో సరిగా చేస్తున్నట్టే లెక్క కదా’ అని అన్నాడు లియో. ‘ఈ ట్రోలింగ్ తరువాత నాకు మద్దతు తెలిపే వారు కూడా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదివి రిప్లయ్ ఇవ్వలేను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని ముగించాడు.
అమ్మాయి గొంతుతో...
లియో కళ్యాణ్ అసలు పేరు ఇంకా మీడియాకు చేరలేదు. అతను ఇదే పేరుతో ఇన్ స్టాలో ఖాతాను నడుపుతున్నాడు. మంచి గాయకుడు. ఇతడు పాడితే అబ్బాయి పాడుతున్నాడో లేక అమ్మాయి పాడుతున్నాడో పోల్చడం కష్టం. గొంతు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా బాలీవుడ్ పాటలు పాడుతుంటాడు. కానీ ఇతనిది పాకిస్తాన్. కొన్నేళ్ల క్రితం లండన్ వచ్చి స్థిరపడ్డాడు. ఇతడు హెమోసెక్సువల్, అందుకే అమ్మాయిల దుస్తులనే ఎక్కువ వాడుతుంటాడు. స్నేహితులు కూడా అమ్మాయిలే ఎక్కువ. తనను ‘ఆమె, అతడు, వారు... ఎలా సంబోధించిన ఫర్వాలేదని చెబతాడు. స్పోటిఫై లో ఇతనికి 25000 మంది అభిమానులు ఉన్నారు. వారు ఇతని పాటలు వినేందుకు చాలా ఇష్టపడతారు.
గెడ్డం, మీసంతో అబ్బాయిలా కనిపించడం, అమ్మాయిల డ్రెస్సులను వేసుకోవడం ఇతడిని చాలా ప్రత్యేకంగా మార్చింది. ఇతని వయసు ముప్పై ఏళ్ల లోపే అని అంచనా.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)