అన్వేషించండి

NTR: వెయిటింగ్ మోడ్‌లో ఎన్టీఆర్ - కొరటాల ఎప్పుడు మొదలుపెడతారో?

ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) 'ఆర్ఆర్ఆర్'(RRR) తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ(Koratala Siva), ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకున్నారు. రీసెంట్ గా 'బ్రహ్మాస్త్ర' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. 

చాలా వరకు బరువు తగ్గారు ఎన్టీఆర్. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ కుమార్ గైడన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ఫిట్ గా తయారయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు 75 కేజీలు. ఇప్పుడు ఆయన కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కొరటాల స్క్రిప్ట్ లాక్ చేస్తే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. దీంతో ఇప్పుడు కొరటాలపై ఒత్తిడి పడుతోంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ సినిమా తరువాత ఆయన చేయబోతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. మరేం జరుగుతుందో చూడాలి. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు అలియాభట్(Alia Bhatt)ను అనుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది. అప్పటినుంచి హీరోయిన్స్ కోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన హీరోయిన్స్ ను మళ్లీ రిపీట్ చేయడం కొరటాలకు ఇష్టం లేదు. టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..!

విజయశాంతి ఓకే చెబుతుందా..?

ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)ని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రాలేదు.

చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్ లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

మరోపక్క 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే.. కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ముందుగా కొరటాల శివ సినిమాను అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ నుంచి మూడు నెలల తరువాత అంటే 2023 ఆరంభంలో బుచ్చిబాబు సినిమా కూడా మొదలైపోతుంది. 

Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget