Pic of the day: భార్యతో ఎన్టీఆర్ ఫొటో - ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి!
తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయ్యారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. NTR 30, NTR 31 సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలను పట్టాలెక్కించడానికి ముందుగానే తన ఫ్యామిలీని తీసుకొని ట్రిప్ కి చెక్కేశారు ఎన్టీఆర్. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు తన ట్రిప్ లో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య ప్రణతితో కలిసి కూర్చొని కబుర్లు చెబుతున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ అందరూ ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగింది. అందుకే అతడి తదుపరి సినిమాలను మొదలుపెట్టడానికి సమయం పడుతుంది. దర్శకులు ఎన్టీఆర్ క్రేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు ఎన్టీఆర్. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి
View this post on Instagram