NTR30 Rumoured Title : ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా టైటిల్ అది కాదు!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమా టైటిల్ ఖరారు అయ్యిందని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తోంది. అయితే... టైటిల్ అది కాదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆ టైటిల్ ఏంటి? అంటే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారా? సెట్స్ మీదకు వెళ్ళక ముందే సాలిడ్ టైటిల్‌తో తారక్ అభిమానులకు, పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రేక్షకులకు దర్శకుడు కొరటాల శివ గూస్ బంప్స్ ఇవ్వనున్నారా? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ చూస్తే... ఎవరైనా అలాగే అనుకుంటారు.
NTR30 Title Not Finalized : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే తాజా సినిమా హీరోగా ఆయనకు 30వది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ అందుకున్నాయి. దీనికి 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని ఎన్టీఆర్30 యూనిట్ వర్గాలు తెలిపాయి.
'ఆర్ఆర్ఆర్'(RRR) విడుదలైన తర్వాత నుంచి ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నారు. ఇప్పటి వరకు కొత్త సినిమాను పట్టాలు ఎక్కించలేదు. కొరటాల శివ (Koratala Siva) తో సినిమా చేయాలని ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అయితే, స్క్రిప్ట్ వర్క్ లేట్ కావడంతో ఆలస్యంగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక దశలో ఈ సినిమా ఆగిందని ప్రచారం జరిగింది. దానికి ఇటీవల యూనిట్ చెక్ పెట్టింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో కొరటాల శివ డిస్కస్ చేస్తున్న స్టిల్స్ విడుదల చేశారు.
డిసెంబర్ నుంచి NTR30 సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించారు. అది ఈ సినిమా కోసమే అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ న్యూ లుక్ అభిమానులకు కిక్ ఇస్తోందని చెప్పవచ్చు. కొంత మందికి ఎన్టీఆర్ నయా లుక్, 'బాద్ షా' సినిమాలో లుక్ తరహాలో ఉందని చెబుతున్నారు.
View this post on Instagram
హీరోయిన్ ఎవరు?
ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆలియా భట్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ ఆమెకు కథ కూడా వివరించారు. అయితే... ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటించే అవకాశాలు లేవు. ఈ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. ఆమె ఒక ఆప్షన్. ఎన్టీఆర్ సినిమా చేయడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు 'మిలి' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ చెప్పారు. ఆమెతో పాటు 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినబడుతోంది. చివరకు, ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.
Also Read : 'యశోద' మాటలు నచ్చాయ్ - సమంత సినిమాతో సత్తా చాటిన సీనియర్ జర్నలిస్టులు
'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు.