Sri Sri Rajavaru: 'శ్రీ శ్రీ రాజావారు'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ బావమరిది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర త్వరలో కథానాయకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఆయన తొలి సినిమాకు టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.
NTR Jr Brother In Law Narne Nithin Chandra Debut Film Titled Sri Sri Rajavaru: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరొక వారసుడు వస్తున్నారు. నందమూరి - నారా కుటుంబాలకు బంధువు ఒకరు కథానాయకుడిగా తెరంగేట్రం చేయడానికి రెడీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) బావమరిది, ప్రముఖ వ్యాపారవేత్త - రాజకీయ నాయకులు నార్నే శ్రీనివాసరావు కుమారుడు నితిన్ చంద్ర (Narne Nithin Chandra) త్వరలో హీరోగా పరిచయం కానున్నారు.
ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర హీరోగా పరిచయం కానున్నారనే విషయం తెలిసిందే. ప్రేక్షకులు మెచ్చిన కుటుంబ చిత్రాలు తీసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన తొలి సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి 'శ్రీ శ్రీ రాజావారు' (Sri Sri Rajavaru Movie) టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ సినిమా 'తీవండి' (Theevandi Telugu Remake) ఆధారంగా 'శ్రీ శ్రీ రాజావారు'ను రూపొందిస్తున్నారని సమాచారం. అయితే... తెలుగు నేటివిటీకి ఆధారంగా పలు మార్పులు చేశారట. మూలకథను తీసుకుని కొత్తగా రాశారట.
'శ్రీ శ్రీ రాజావారు' (Narne Nithin Chandra's Sri Sri Rajavaru Shooting Completed) షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ మావగారు నార్నే శ్రీనివాసరావు నిర్మించినట్టు తెలుస్తోంది.
Also Read: తేడా ఉండాలిగా! ట్రైలర్‌లో అన్నీ ఆశిస్తే ఎలా? - మిక్డ్స్ టాక్ గురించే తమన్ ఆ ట్వీట్ చేశారా?
దర్శకుడిగా సతీష్ వేగేశ్నకు 'శతమానం భవతి' సినిమా పేరు తీసుకు వచ్చింది. ఆ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా లభించింది. ఆ స్థాయి పేరు, విజయం 'శ్రీ శ్రీ రాజావారు' తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నారట. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కథ పట్ల చాలా నమ్మకంగా ఉన్నారట. నార్నే నితిన్ చంద్ర నటనలో శిక్షణ తీసుకుని 'శ్రీ శ్రీ రాజావారు' చేశారట. సినిమా పూర్తి అయిన తర్వాత మంచి విడుదల తేదీ చూసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నారు. బహుశా... వేసవి తర్వాత విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ.
Also Read: గుండె పోటు వచ్చిన వారికి మొదటి మూడు నిమిషాల్లో ఏం చేయాలి? రాజమౌళి అవగాహనా కార్యక్రమం, వీడియో చూడండి