Devara: ఎన్టీఆర్ సినిమా ఇంకా లేట్ - దేవర వాయిదాకు కారణాలు ఇవే!
NTR's Devara Movie Update: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' విడుదల వాయిదా పడటం ఖాయమని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Devara release postponed from April 5, 2024: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది ఎన్ని రోజులు అయ్యింది? ఇవాళ్టికి 669 రోజులు. ఒక ఏడాది 9 నెలల 29 రోజులు. మార్చి 25, 2022లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమా 'దేవర'. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన రెండేళ్లకు... ఏప్రిల్ 5, 2024లో ఆ సినిమా విడుదల అవుతుందని ఆశించిన అభిమానులకు బ్యాడ్ న్యూస్. 'దేవర' విడుదల వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
'దేవర' వాయిదాకు కారణాలు ఏమిటి?
Reasons for Devara release postpone: కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు 'దేవర' వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వెనుక చాలా అంశాలు ఉన్నాయట! అందులో మొదటిది... ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా దాటి జపాన్ వరకు చేరింది. ఆ సినిమా రాజమౌళి, 'బాహుబలి' బ్రాండింగ్ వల్ల విదేశాల్లోనూ బాగా ఆడింది. అయితే హోమ్ గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ కదా! తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో జూ ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్. ఆయన సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 5కు అటు ఇటుగా ఉండవచ్చని వినబడుతోంది. అందుకని, వాయిదా వేయాలని భావిస్తున్నారట.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఫైనలైజ్ చేయలేదని ఫిల్మ్ నగర్ గుసగుస. పాన్ ఇండియా రిలీజ్ అంటే రెండు మూడు నెలల ముందు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. సాంగ్స్ విడుదల చేయాలి. సో... ప్రజెంట్ అటువంటి సిట్యువేషన్ కనిపించడం లేదు.
Also Read: కొత్త కారు కొన్న తమిళ హీరో దళపతి విజయ్ - బాబోయ్ అంత రేటా?
'దేవర' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యారు. చిన్న చిన్న గాయాల కారణంగా చికిత్స తీసుకోవడానికి వెళ్లారు. డిశ్చార్జి అయినప్పటికీ... ఆయన మీద తీయాల్సిన సన్నివేశాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ అవి త్వరగా తీసినా... మ్యూజిక్ లేట్ కావడం, ఏపీ ఎలక్షన్స్ వంటివి వాయిదాకు దారి తీశారని టాక్. అయితే, ఇంకా 'దేవర' టీం నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు.
Also Read: నిర్మాత ఎస్కేఎన్ ఇంటికి అల్లు అర్జున్... తండ్రి మరణించిన బాధలో ఉన్న ఆత్మీయుడికి ధైర్యం చెప్పిన బన్నీ
'జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో ఆయన జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.
Also Read: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ చూశారా?