NTR 30 Update : ఆరు నెలల్లో ఎన్టీఆర్, కొరటాల ఫినిష్ చేస్తారా? 'ఆర్ఆర్ఆర్' విడుదల రోజే సెట్స్ మీదకు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ తమకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? ఆరు నెలల్లో వాళ్ళు ఆ పని చేయగలరా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులకు ఓ విషయంలో హీరోపై అసంతృప్తిగా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలై 10 నెలలు కావొస్తున్నా... కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. ఆలస్యం కావడం వాళ్ళకు ఎంత మాత్రం నచ్చడం లేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే కనీసం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎలా లేదన్నా ఏడాది పడుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ & కొరటాల వాళ్ళను సర్‌ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
'ఆర్ఆర్ఆర్' విడుదలైన రోజే?
'ఆర్ఆర్ఆర్' ఎప్పుడు విడుదల అయ్యింది? మార్చి 25న! ఆ రోజే ఎన్టీఆర్ 30వ సినిమాను సెట్స్ మీదకు వెళ్ళాలని ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. లేదంటే మార్చి 30న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం మీద 'ఆర్ఆర్ఆర్' విడుదలైన ఏడాది తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగుకు వెళతారన్నమాట. ఆ తర్వాత ఆరు నెలల్లో, సెప్టెంబర్ కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని తమకు తాము ఎన్టీఆర్ & కొరటాల టార్గెట్ పెట్టుకున్నారట. అదీ సంగతి!
2024లో ఎన్టీఆర్30...
ఏప్రిల్ 5 గుర్తుందిగా!
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా విడుదల ఈ ఏడాదిలో లేనట్టే! ఈ 2023లో సినిమా విడుదల చేయడం లేదని, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.
Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?
ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది.
Also Read : 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'బృందావనం' చిత్రానికి ఆయన స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.
'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు.
ఎన్టీఆర్ 30లో కథానాయికగా తొలుత ఆలియా భట్ పేరు వినిపించింది. అయితే, ఆమె తల్లి కావడంతో పాటు షూటింగ్ లేట్ కావడం వల్ల ఇప్పుడు ఆమెను తీసుకునే ఛాన్స్ లేదు. లేటెస్టుగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.