![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora Fatehi - Akshay Kumar: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో
ఊ అంటావా పాటకు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, నోరా ఫతేహి అదిరిపోయే డ్యాన్స్ చేశారు. వారి స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
![Nora Fatehi - Akshay Kumar: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో Nora Fatehi Akshay Kumar's Hot Dance Moves to Samantha Ruth Prabhu's Oo Antava Song Goes Viral Nora Fatehi - Akshay Kumar: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/4e90a2402b3d3e758bcd0badad2a81701678428066087544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఏ రేంజిలో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని చోట్ల సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక సమంత చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకు ఓ రేంజిలో హైప్ తీసుకురావడంలో ఈ పాట ఎంతో ఉపయోగపడింది. సమంత స్టెప్పులకు అభిమానులు థియేటర్లలో చేసిన హంగామా మామూలుగా లేదు. ఇప్పటికీ ఆ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, నోరా ఫతేహి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. సమంతాకు మించి స్టెప్పులు వేస్తూ అదురుస్స్ అనిపించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అక్షయ్, నోరా డ్యాన్స్ కు ఆడియెన్స్ ఫిదా
తాజాగా అమెరికాలో ది ఎంటర్టైన్మెంట్స్ వేడుక జరిగింది. ఇందులో పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. అక్షయ్ కుమార్, దిశా పటానీ, మౌనీ రాయ్, సోనమ్ బజ్వా, నోరా ఫతేహి, అయుష్మాన్ ఖురానా, స్టెబిన్ బెన్ సహా పలువురు నటీనటులు హాజరయ్యారు. అట్లాంటాలో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్లో అక్షయ్ కుమార్, నోరా ఫతేహి ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటవా మావ’ పాటకు, సూపర్ డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించారు. సినిమాలో సమంత, అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్లు దింపేశారు అక్షయ్, నోరా. వారు డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆడియెన్స్ లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ ఉత్సాహ పరిచారు. ఈ డ్యాన్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ప్రేక్షకులను ఆకట్టుకోని అక్షయ్ ‘సెల్పీ’
ప్రస్తుతం పలు సినిమాలతో అక్షయ్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సెల్ఫీ’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ, నుష్రత్ భరుచ్చా కీలక పాత్రలు పోషించారు. 2019 మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. RTO ఇన్‌స్పెక్టర్, ప్రముఖ నటుడి మధ్య పోటీ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంపై అక్షయ్ స్పందించారు. తన కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగినట్లు అభివర్ణించారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు.
Read Also: సారా కాదు రష్మిక - అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్న శుభ్‌మాన్ గిల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)