ShyamSinghaRoy: ముచ్చటగా ముగ్గురు హీరోయిన్ల శ్యామ్ సింగ రాయ్... ఏ పాత్రలో ఎవరు?
నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా అప్డేట్ ట్రెండవుతోంది.
టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని పక్కన ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఈ హీరోయిన్ల పాత్రకు సంబంధించి ఓ హింట్ ను ఇచ్చారు నేచురల్ స్టార్ నాని. దాన్ని బట్టి చూస్తే ఇందులో నానికి జతగా ఉండేది సాయి పల్లవి, కృతి శెట్టి అని తెలుస్తోంది. ఇక మడోన్నా సెబాస్టియన్ ఏదైనా కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉంది.
దీపావళి నాడు తన ముగ్గురు హీరోయిన్ల గురించి ట్వీట్ చేశాడు నాని. అందులో మడోనా - నిజం అని రాశాడు. అంటే ఆమె శ్యామ్ సింగ రాయ కథను శోధించే కీలక పాత్రలో కనిపించవచ్చు. ఇక కృతి శెట్టికి మెమోరీ అనే పదాన్ని వాడారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో కనిపించవచ్చు. సాయి పల్లవి పాత్ర గురించి హింట్ ఇస్తూ ‘టైమ్’ అని చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతంలో హీరోకు జోడీగా నడిచే పాత్ర కావచ్చు. ఏదైనా ట్వీట్ ద్వారా అభిమానుల్లో ఆసక్తిని పెంచేశారు నేచురల్ స్టార్ నాని.
Also read: రియాల్టీషోలో గెలుచుకునే ప్రైజ్‌మనీ మొత్తం విజేతకు దక్కుతుందా? లేక అందులో కూడా కటింగ్స్ ఉంటాయా?
శ్యామ్ సింగ రాయ్ తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుందని చెబుతున్నారు ఫిల్మ్ మేకర్స్. నాని స్టిల్స్ చూస్తుంటే ఈ సినిమా వింటేజ్ డ్రామాలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడొచ్చనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే క్రిస్మస్ లక్ష్యంగా మరిన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య ‘అఖండ’ కూడా రాబోతోంది. అలాగే డిసెంబర్ 17న ‘పుష్ప’ విడుదల కాబోతోంది. కాబట్టి శ్యామ్ సింగ రాయ్ విడుదల ఎప్పుడో వేచిచూడాల్సిందే.
The TRIDENT 🔱 of #ShyamSinghaRoy that surpasses
— Nani (@NameisNani) November 4, 2021
TRUTH @MadonnaSebast14
MEMORY @IamKrithiShetty and
TIME @Sai_Pallavi92
wishing you all a Very #HappyDiwali #SSRonDEC24th 💥@Rahul_Sankrityn @MickeyJMeyer @vboyanapalli @NiharikaEnt @SSRTheFilm pic.twitter.com/6J4vivTp6A
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి