VK Naresh: ‘తిరుపతిలో షూస్ దొరకలేదు, వాటి కోసం మళ్లీ హైదరాబాద్ వెళ్లాలి’ - వీకే నరేష్ ట్వీట్, ట్రోల్స్ మామూలుగా లేవు
ప్రముఖ నటుడు వీకే నరేష్ మంగళవారం చేసిన ట్వీట్‌పై నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? నెటిజనులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
VK Naresh: ఈ మధ్య సోషల్ మీడియాలో నటీనటులపై ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి. వారు పెట్టే ఫొటోలు లేదా పోస్టుల్లో ఏదైనా తేడా ఉంటే చాలు.. ఉతికి ఆరేస్తున్నారు. కొందరైతే వార్తల్లో కూడా రాయలేని పదాలతో వారిని తిట్టిపోస్తున్నారు. అయితే, ఒకరిని అలా నిందించడం చాలా తప్పు. అలాగే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని తెలిసి కూడా కొందరు సెలబ్రిటీలు పోస్టులు పెడుతుంటారు. మరి, అవి కావాలని పెడతారా? లేదా వేరే ఆలోచన లేకుండా పెడతారా అనేది వారికే తెలియాలి.
‘మా’ ఎన్నికలు, ‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల నేపథ్యంలో ఇటీవల మోహన్ బాబు కుటుంబాన్ని నెటిజనులు, ట్రోలర్స్ ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలిసిందే. వారి ట్రోల్స్‌ను తట్టుకోలేక మంచు కుటుంబం రూ.10 కోట్లు దావా వేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, ట్రోలర్స్ దాన్ని కూడా వదలకుండా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే మంచు విష్ణును విమర్శించేందుకు సిద్ధమైపోతున్నారు. ఎందుకిలా ట్రోల్స్ చేస్తున్నారని విమర్శకులను ప్రశ్నిస్తే.. వారి సెల్ఫ్ డబ్బాను భరించలేకపోతున్నామని అంటున్నారు.
ఇక నరేష్ విషయానికి వస్తే.. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకు అండగా, ఆయన ప్యానెల్ గెలిచేందుకు ఎంతో ప్రయత్నిచారు. చివరికి అనుకున్నది సాధించారు. అన్నట్లుగానే విష్ణును ‘మా’ అధ్యక్షుడిని చేశారు. దీంతో నెటిజనులు నరేష్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. ‘మా’ ఎన్నికల సమయంలోనే కాకుండా, సాయి ధరమ్ తేజ్ బైకు ప్రమాద సమయంలో కూడా నరేష్ ఓ విషయంలో నోరు జారారనే కారణంతో ఆయన్ని ట్రోల్ చేశారు. తాజాగా నరేష్ తిరుపతి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ట్వీట్లో పేర్కొన్న విషయం నెటిజనులకు నచ్చలేదు. ‘‘నైక్ ఎయిర్ షూస్ కోసం గంట సేపటి నుంచి తిరుపతి చుట్టూ తిరుగుతున్నా. కానీ, ఎక్కడా దొరకలేదు. వాటి కోసం తిరిగి హైదరాబాద్ వెళ్లాలి. చాలా వింతగా ఉంది’’ అని పెట్టారు. దీంతో నెటిజనులు ‘‘ఈ గొప్పలే వద్దు’’ అంటూ హితవు పలుకుతున్నారు. ‘‘మరికొందరు ఆ షూలే కొనాలా మరో షో కొనుక్కో కూడదా? దాని కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి’’ అని అంటున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.
Hmmm pic.twitter.com/XyZOwE5SvW
— pasu pathi 🔔 (@anna_mental) March 1, 2022
Roaming about Tirupathi for the last 1 hour for a pair for a pair of nike air shoes. Nope. No where. Have to go back to Hyderabad for them. Hmm strange pic.twitter.com/fyKboJZySA
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 1, 2022
అరెనీపాసుగుల్లా,కోర్టుకు ఎడమవైపు ఫైరింజన్ ఆఫీసుంటుంది.దాని వెనకాల ఓ వీధుంటుంది.అక్కడకెల్లి బోడిసావిత్రి ఇల్లెక్కడ?అని అడుగు చెప్తారు.ఆమె దగ్గర నీకు కావాల్సినేటియి దొరుకుతాయి.ట్రై చెయ్ .తిరుపతంతా గంటలో తిరిగావా?మాప్ లోనా?ఇలాంటి ట్వీట్లతో నీ పరువు నువ్వే తీసుకోడం ఏంటి?
— రాష్ఠ్ర కూట్ (@ANR1929) March 1, 2022
Nike Kaakunda Vere Shoes Vadaleva Uncle .
— Harry 🇮🇳 🇰🇷 (@Twilightsaga_55) March 1, 2022
ఎప్పుడు మనకు నచ్చినట్లు ఉండదు , సర్దుకు పోవాలి pic.twitter.com/5uGFxgesyw
— The Dude🔥 (@chillaxforever) March 1, 2022
TK street ki vellu, a brand kavalante aaa brand sec lo print chesi chethilo pedatharu. @iVishnuManchu cheppaleda anna nv mi babai ki.
— venkatg (@venkatgaleti) March 1, 2022
Darilo vijaywada undi kada ...hyd varaku enduku anta
— Sampath (@SampathYerroju) March 1, 2022
Dabbulu theeskellakunda Mohan Babu, Vishnu na friends ye ani untav... Inkem dorukuthay
— Manalnevadra aapedhi 🌋⚰️ (@ReversePlay) March 1, 2022
తెగిపోయే బూట్లకి బ్రాండ్ యాల సారూ?
— నరసింహారెడ్డి.బి (@Narasim42753713) March 1, 2022
రంగమేదైనా,విషయం మనలో ఉంటే చాలు మనం ఏది తొడిగితే అదే బ్రాండు.
Adjust avvandi sir eesaari paragon tho saripettukondi
— The Dude🔥 (@chillaxforever) March 1, 2022
గమనిక: సోషల్ మీడియాలో నెటిజనుల చేసే ట్వీట్లను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ట్వీట్లలో పేర్కొన్న వ్యాఖ్యాలన్నీ వారి వ్యక్తిగతం. వారి కామెంట్స్‌తో ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’కు ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు.