అన్వేషించండి

'ఆదిపురుష్'పై నెగటివ్ రివ్యూ - యువకుడిని చితకబాదిన అభిమానులు

రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' సినిమా రిలీజైంది. ఈ నేపథ్యంలో మూవీపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Aadipurush : భారీ బడ్జెట్ అండ్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై సెన్సేషన్ సృష్టిస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' కు వ్యతిరేకంగా రివ్యూ ఇచ్చిన వారిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు 'వరెస్ట్ బిహేవియర్' అంటూ అభిమానులపై మండిపడుతున్నారు.

'ఆదిపురుష్' సినిమాపై విమర్శలు చేసినందుకు ఓ వ్యక్తిని కొందరు అభిమానులు కొట్టిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగినట్టు సమాచారం. ఈ వీడియో యువకుడు మాటిన మాటలు కూడా వైరల్ గా మారాయి. “ఆచార్య సినిమాలో చిరంజీవి గారిని గ్రాఫిక్స్ లో ఎలా చూశామో.. ఈ సినిమాలో ప్రభాస్ ను కూడా అలాగే చూపించారు. ఇందులో ప్లే స్టేషన్ గేమ్స్ నుంచి అన్ని రాక్షసులను తీసుకువచ్చిన ఉంచారు. హనుమాన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, అక్కడక్కడా కొన్ని 3డి షాట్లు తప్ప ఈ సినిమాలో మరేమీ లేవు. ప్రభాస్ నటన గురించి చెప్పాలంటే రాముడి గెటప్‌ ఆయనకు అస్సలు సూట్ కాలేదు. బాహుబ‌లిలో ఒక రాజులా ఉండేవాడు, రాజ‌కీయ ప‌రిస్థితులు ఉండేవి. అందులోని రాయల్టీని చూసి ఈ పాత్రకు ఆయన్ను తీసుకున్నారు. డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్ లో ప్రభాస్‌ని సరిగ్గా చూపించలేదు" అని ఓ యువకుడు వీడియోలో తెలిపారు.

ఈ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి తిట్టడం మొదలుపెట్టాడు. "కళ్లు ఎక్కడ పెట్టుకుని చూశావ్" అంటూ.. అతనితో పాటు మరికొందరు కూడా ఆ యువకుడిని కొట్టేందుకు మీదికి వచ్చారు. "దెబ్బలు తినకుండా వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లిపో" అంటూ అరుస్తూ హెచ్చరించారు. "కళ్లద్దాలు తీసి సినిమా చూసినట్టున్నాడు.. అందుకే ఇలా చెప్తున్నాడం"టూ బూతులతో అతన్ని బెదిరించారు. ఈ క్రమంలోనే యువకుడి టీ షర్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. అంతలోనే అక్కడికి వచ్చిన మరికొందరు యువకులు వారిని ఆపి, యువకుడిని రక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ షేర్ అవుతోంది. 

ఈ వీడియోపై కొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జెన్యూన్ రివ్యూ ఇచ్చినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పని చేశారంటూ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లలో పంచుకోవడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వీడియోపై కామెంట్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. విజయ్ ఫ్యాన్స్ లాగే చేస్తున్నారని కొందరు కామెంట్స్ పెడుతుండగా.. విజయ్, అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఎప్పుడూ కొట్టుకునే వాళ్లలాగే ఉన్నారని మరికొందరు అంటున్నారు. ఆ యువకుడు చెప్పింది జెన్యూన్ రివ్యూ అంటూ ఇంకొందరు అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఇక ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, హీరోయిన్ కృతి సనన్ సీతగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.

Read Also : Adipurush Movie: రూ.600 కోట్ల పనితనం ఇదా? రావణుడి గ్రాఫిక్స్ పై నెటిజన్ల సెటైర్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Embed widget