Netflix: 2023లో షాకివ్వనున్న నెట్‌ఫ్లిక్స్ - ఇక పాస్‌వర్డ్ షేర్ చేస్తే డబ్బులు కట్టాల్సిందేనా?
మీకు నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉందా? బంధు మిత్రులకు పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా? అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ ఆపండి. లేదంటే అదనపు ఛార్జ్ చెల్లించక తప్పదు. జనవరి నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి. ఒకరు అకౌంట్ ను కలిగి ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది Netflix. జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఆదాయం పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడ
కొంతకాలంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో డబ్బును సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది Netflix చాలా మంది చందాదారులను కోల్పోయింది. మిగతా ఓటీటీ సంస్థల నుంచి సైతం గణనీమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే పాస్ వర్డ్ షేరింగ్ ను కట్టడి చేస్తామని ఆ సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్ ఇప్పటికే ప్రకటించారు. జనవరి నుంచి ఈ అవకాశాన్ని నిలిపివేస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.
పాస్ వర్డ్ షేర్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
పాస్ వర్డ్ షేర్ చేయాలి అనుకునే వారు కొంత ఛార్జీ చెల్లించి షేర్ చేసుకోవచ్చని Netflix వెల్లడించింది. అయితే, పాస్ వర్డ్ షేరింగ్ అనేది కుటుంబ సభ్యులు ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. బయటివారు ఉపయోగిస్తేనే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే భారత్ లోనూ పాస్ వర్డ్ షేరింగ్ కు ఛార్జ్ చెల్లించే నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్ వర్డ్స్ షేర్ చేసినందుకు యూజర్లకు ఛార్జీ విధించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఇండియాలో.. ‘Add a home’ ఫీచర్‌ను తీసుకురానుంది.
వచ్చే నెలలో భారత్ లోనూ ఛార్జీలు అమలు
Add a home అనే ఫీచర్ వచ్చే నెలలో భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ ఫ్లిక్ అకౌంట్ ఉన్న వారు తమ ఇంట్లోని ఏదైనా డివైజ్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతరులకు పాస్ వర్డ్ షేర్ చేయాలి అంటే మాత్రం ఛార్జ్ చెల్లించాలి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని నెట్ ఫ్లిక్ అమలు చేస్తోంది. ఇండియాలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఛార్జ్ ఎంత విధిస్తారు? అనే విషయంపై నెట్ ఫ్లిక్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బేసిక్ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ లో యూజర్లు ఒక్క హోంను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్, ప్రీమియం యూజర్లు రెండు, మూడు హోంలకు యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది.
Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు