Nayanthara Vignesh Shivan: నయన్ - విఘ్నేష్‌ల కవల పిల్లలను చూశారా? వైరల్ అవుతోన్న వీడియో
నయనతార దంపతులు తమ కవల పిల్లలను ఎత్తుకుని అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గడిచిన కొద్ది రోజులుగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సుదీర్ఘ ప్రేమాయణానికి తెర దించుతూ పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇటీవలే కవలలకు జన్మనిచ్చారు. సరోగసి ద్వారా ఈ బిడ్డలను కన్నారు. వీరి పిల్లల వ్యవహారం కూడా పెద్ద దుమారం రేపింది. పెళ్లై 9 నెలలు నిండక ముందే ఎలా పిల్లలు జన్మించారంటూ రచ్చ జరిగింది. ఈ విషయానికి సంబంధించి నయన్ దంపతులు తమిళ ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ట్విన్స్ తో శుభాకాంక్షలు చెప్పిన నయనతార దంపతులు
ఇక కవలలతో నయన్ దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ట్విన్స్ పుట్టగానే ఇద్దరు పిల్లల కాళ్లను ముద్దాడుతూ సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసిన ఈ జంట.. ప్రస్తుతం దీపావళి శుభాకాంక్షలు కూడా వెరైటీగా చెప్పారు. తమ కవలలను ఎత్తుకుని విషెస్ చెప్పారు. ఈ వీడియోను విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అయితే, ఫోటోలు, వీడియోల్లో తమ పిల్లల ముఖాలను చూపించలేదు.
View this post on Instagram
ప్రేమ ఒక్కటే జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది!
ఇక ఈ వీడియోన్ ఇన్ స్టాలో పోస్టు చేసిన విఘ్నేష్ శివన్.. పలు విషయాలు వెల్లడించాడు. “మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రేమ ఒక్కటే జీవితాన్ని సంతోషంగా మార్చుతుందని గుర్తుంచుకోవాలి. ప్రేమలో విశ్వాసంతో పాటు మంచితనం అనే ఎప్పుడూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ బలంగా ఉండగలుగుతుంది” అని రాసుకొచ్చాడు.
Also Read: దీపావళికి చక్కగా చీరలో ముస్తాబైన ముద్దుగుమ్మలు
ఈ ఏడాది జూన్ 9న నయన్-విఘ్నేష్ వివాహం
గడిచిన కొద్ది సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతున్న నయనతార, విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన 9న పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి టైం దొరికినప్పుడల్లా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విఘ్నేష్ శివన్ బర్త్ డే వేడుకలను.. నయనతార ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు జరిపి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ వేడుకల్లో నయన్, విఘ్నేష్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
View this post on Instagram