Nayanthara: చిరంజీవి 'గాడ్ ఫాదర్' వీళ్ళిద్దరికీ హ్యాట్రిక్! నయన్‌తో సినిమా అంటే
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా వీళ్ళిద్దరికీ హ్యాట్రిక్. రీసెంట్‌గా మేజర్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా నయనతార గురించి మోహన్ రాజా ఏమన్నారంటే?
'గాడ్ ఫాదర్'లో కథానాయిక నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజాతో ఆమెకు హ్యాట్రిక్ సినిమా ఇది. తెలుగులో 'ధృవ'గా రీమేక్ అయిన తమిళ మాతృక 'తని ఒరువన్', ఆ తర్వాత 'వేలైక్కారన్' సినిమాల్లో నయనతార నటించారు. ఆ రెండు సినిమాలకూ మోహన్ రాజాయే దర్శకుడు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల తర్వాత మరోసారి 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు వీళ్ళిద్దరూ!
'గాడ్ ఫాదర్' మేజర్ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా "లేడీ సూపర్ స్టార్ నయనతారతో 'గాడ్ ఫాదర్' మేజర్ షెడ్యూల్ పూర్తి చేశాం. ఆమెతో మూడుసారి పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని మోహన్ రాజా పోస్ట్ చేశారు. నయనతారతో దిగిన ఫొటోను యాడ్ చేశారు. ప్రేమికుల రోజున విఘ్నేష్ శివన్‌కు గ్రీటింగ్స్ చెబుతూ ఫ్లవర్ బొకే ఇచ్చి, అతడితో టైమ్ స్పెండ్ చేసిన నయనతార... ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' సెట్స్‌కు వచ్చి షూటింగ్ చేశారు. ఆమె డెడికేషన్ గురించి యూనిట్ గొప్పగా చెబుతోంది.
Finished a major schedule today with the lady superstar #Nayanthara for our #Godfather
— Mohan Raja (@jayam_mohanraja) February 16, 2022
It’s nothing less than sheer joy n satisfaction working with her for the consecutive third time #Thanioruvan#Velaikkaran #Godfather pic.twitter.com/PqQ8BE4z4r
Also Read: 'భీమ్లా నాయక్' - ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఆర్ఆర్ఆర్?
'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవితో నయనతార చేస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'. 'సైరా...'లో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. కానీ, 'గాడ్ ఫాదర్'లో ఆలా కాదు. చిరంజీవికి వరుసకు సోదరి అయ్యే పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హిట్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. మంజూ వారియర్ పోషించిన పాత్రను నయనతార చేస్తున్నారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్
View this post on Instagram