Nayanthara-Vignesh: ధనుష్ వల్లే నయనతారతో పెళ్లి - ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన విఘ్నేష్ శివన్
తమిళ స్టార్ హీరో ధనుష్ కారణంగా నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగిందట. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా చెప్పడం విశేషం.
Dhanush Played Cupid For Nayanthara And Vignesh Shivan: సౌత్ లో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ అనగానే గుర్తొచ్చేది నయనతార, విఘ్నేష్ శివన్. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు. అయితే, వీరి పెళ్లికి కారణమైన వ్యక్తి తమిళ స్టార్ హీరో ధనుష్ అట. ఈ విషయాన్ని స్వయంగా నయనతార దంపతులే చెప్పడం విశేషం.
ధనుష్ వల్లే నయనతార, విఘ్నేష్ పెళ్లి
నయనతార, విఘ్నేష్ శివన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? దానికి అసలు కారణం ఎవరు? అనే విషయాల గురించి మాట్లాడారు. “2015లో ‘నేను రౌడీనే’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఆ సినిమాకు ధనుష్ నిర్మాతగా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా ఎవరు అయితే బాగుంటుంది? అని ఆలోచిస్తున్నాను. ఆ సమయంలోనే హీరో ధనుష్ నాకో విషయం చెప్పారు. నయనతారను హీరోయిన్ గా తీసుకోమని చెప్పారు. నేను వెళ్లి ఆమెకు స్టోరీ చెప్పాను. తనకు కథ బాగా నచ్చింది. ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పడంతో, తొలుత ఈ సినిమా చేయనని చెప్పిన విజయ్ సేతుపతి కూడా ఓకే చెప్పారు. నిజానికి ఆయనకు ఈ సినిమా స్క్రిప్ట్ మీద నమ్మకం లేదు. కేవలం నయనతార ఒప్పుకుంది అనే కారణంతో సరే అన్నారు. ఈ సినిమా షూటింగ్ కు సుమారు సంవత్సరం సమయం పట్టింది. ఒక సంవత్సరం పాటు నయనతారతో క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశం కలిగింది. ఆ సమయంలోనే మా మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరినోకరం బాగా అర్థం చేసుకున్నాం. ధనుష్ ఒకవేళ నయనతార పేరు చెప్పి ఉండకపోతే ఆమెను తీసుకునే వాడిని కాదు. అతడి వల్లే నయనతారను కలిశాను. ఆయన వల్లే మా పెళ్లి జరిగింది” అని విఘ్నేష్ వివరించారు.
మూడు నెలల్లోనే ప్రేమలో పడిపోయా- నయనతార
తమ బంధం గురించి నయనతార కూడా కీలక విషయాలు వెల్లడించింది. ఆ సినిమా సమయంలో కొద్ది రోజుల్లోనే ఇంకా చెప్పాలంటే కేవలం మూడు నెలల్లోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. కొన్ని బంధాలు మనసుతో దగ్గర అవుతాయని.. అలాంటి బంధమే విఘ్నేష్ తో ఏర్పడిందని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగిందన్నారు.
ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి
2015 ‘నేను రౌడీనే’ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. సుమారు ఏడు సంవత్సరాల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. 2021లో తమ ప్రేమను ఓపెన్ గా చెప్పారు. 2022 జూన్ 9న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు ట్విన్స్ ను కన్నారు. వారిలో ఒకరికి ఉయిర్, మరొకరికి ఉలగమ్ అనే పేరు పెట్టారు.
Read Also: ‘LSD 2’లో కీలక పాత్రలో ట్రాన్స్ జెండర్, ఇంతకీ ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?