News
News
X

Nandamuri Balakrishna: వీరసింహా రెడ్డి చరిత్రలో నిలిచిపోతుంది - నేనెప్పటికైనా చేయాలనుకునే సినిమా అదే: నందమూరి బాలకృష్ణ

శుక్రవారం ఒంగోలులో జరిగిన వీరసింహా రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.

FOLLOW US: 
Share:

‘వీరసింహా రెడ్డి’ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమా అవుతుందని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే చెంఘిజ్ ఖాన్ కథతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని, అది ఎప్పటికైనా చేస్తానని తెలిపారు. ఒంగోలులో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్లు శ్రుతి హాసన్, హనీ రోజ్, దర్శకుడు గోపిచంద్ మలినేని, నిర్మాతలు  సహా  చిత్రబృందం హాజరైంది.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నన్ను నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్ కు ధన్యవాదాలు. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. వీరసింహా రెడ్డి వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి.గోపాల్ మాత్రమే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం.’

‘నటులు, టెక్నిషియన్ల నుంచి పూర్తిస్థాయిలో ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్  మలినేని. ఈయనే కాదు నా తర్వాతి సినిమా దర్శకుడు అనిల్  రావిపూడిది కూడా ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకు సంబంధించిన సినిమాలకు పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. చాలా రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా అస్సలు కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం, బాధ్యతలు నిర్వహించడంలోనే నాకు సంతృప్తి.’

‘బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలకే పరిమితం అని అనుకునే వారికి సమాధానం ఆహా ద్వారా నేను చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం. టాక్  షోలలో అది ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీరసింహారెడ్డి ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు.‘

‘ఇక దునియా విజయ్  కన్నడ చిత్ర పరిశ్రమలో కథానాయకుడు అయినా ఈ సినిమాలో విలన్  పాత్రలో నటించడం గొప్ప విషయం. నేను కూడా సప్తగిరి నుంచి కామెడీ టైమింగ్  నేర్చుకోవాలి. తమన్  సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో అందరూ చూశారు. థియేటర్లలో రీరికార్డింగ్ కు ఎన్ని సౌండ్  బాక్సులు బద్దలవుతాయో త్వరలో చూస్తారు. ఈ సినిమాకు సాయి మాధవ్  బుర్రా రాసిన మాటలు బాగా పేలతాయి. ఇది చాలా అద్భుతమైన సినిమా. ఇది బాగా ఆడాలని కోరుకోను. ఎందుకంటే కచ్చితంగా బాగా ఆడి తీరుతుంది.’ అన్నారు.

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Published at : 07 Jan 2023 01:28 AM (IST) Tags: Nandamuri Balakrishna Nandamuri Balakrishna Speech NBK Veerasimha Reddy Veerasimha Reddy Pre Release Event

సంబంధిత కథనాలు

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్

Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy :  సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao :  వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?