By: ABP Desam | Updated at : 07 Dec 2022 01:40 PM (IST)
బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ సంస్థ ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడు. కొన్ని రోజుల క్రితం సినిమాను ప్రకటించారు. ఈ రోజు సినిమా గురించి నిర్మాతలు సాహూ గారపాటి, హరీష్ పెద్ది క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. అది ఏంటంటే...
NBK 108 Launch : గురువారం (డిసెంబర్ 8న) ఉదయం 9 గంటల 36 నిమిషాలకు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. ఈ రోజు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి పాదాల చెంత స్క్రిప్ట్ ఉంచి పూజలు నిర్వహించారని తెలిసింది.
తమన్ సంగీతంలో...
బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రమిది. ఈ చిత్రానికి సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్.
బాలయ్యకు జోడీగా ప్రియాంక?
ఈ సినిమాలో కథానాయికగా 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar) ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు ఫోటో షూట్ చేశారు. ప్రియాంకను ఎంపిక చేసిందీ? లేనిదీ? సినిమా ఓపెనింగ్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'టాక్సీవాలా' సత్యదేవ్ 'తిమ్మరుసు', కిరణ్ అబ్బవరం 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలతో ప్రియాంకా జవాల్కర్ పేరు తెచ్చుకున్నారు. ఆమె లాస్ట్ సినిమా 'గమనం'. అందులో శివ కందుకూరికి జోడీగా నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఆమె మరో మెట్టు ఎక్కినట్టే.
తొలుత బాలకృష్ణకు జోడీగా సోనాక్షీ సిన్హా పేరు కూడా వినిపించింది. అయితే... ఆమెను కాదని తెలుగు వచ్చిన, అనంతపురంలో పెరిగిన మరాఠీ అమ్మాయి ప్రియాంకా జవాల్కర్ వైపు చిత్ర బృందం మొగ్గు చూపిస్తోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) పేరు పరిశీలనలో ఉంది.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) విడుదల కానుంది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' (Aditya 999 Movie) సెట్స్ మీదకు వెళ్ళనుంది. దానికి బాలకృష్ణ స్క్రిప్ట్ రాస్తున్నారు. అంతే కాదు... ఆయనే డైరెక్ట్ చేయనున్నారు (Balakrishna Will Direct Aditya 999).
Also Read : ఇండియాలో 'అవతార్ 2' కలెక్షన్స్ - పది కోట్లు అండ్ కౌంటింగ్
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి