NBK107: నల్ల చొక్కాలో నటసింహం, మాస్ లుక్‌లో బాలయ్య మహాజాతర
బాలయ్య నటిస్తోన్న #NBK107 సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
ఇటీవల 'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని నడుచుకొని వస్తోన్న ఈ స్టిల్ మాములుగా లేదు. బాలయ్య బొట్టు, గాగుల్స్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ టెరిఫిక్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం ఇదే డ్రెస్ లో ఉన్న బాలయ్య లుక్ ఒకటి లీకైంది. అందుకే దర్శకనిర్మాతలు ఇంత త్వరగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినట్లున్నారు.
ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇది అయితే కథకు యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.
View this post on Instagram