Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదల అయిన పాటలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి ట్రైలర్‌ను (Bhagavanth Kesari Trailer) ఆదివారం విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణను కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో బాలయ్య చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీకి భిన్నంగా ఉండటం కొత్తగా అనిపిస్తుంది. కానీ బాలయ్య మార్కు యాక్షన్ సన్నివేశాలు మాత్రం మిస్ కానివ్వలేదు. థమన్ (SS Thaman) అందించిన రీ-రికార్డింగ్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లింది.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
‘భగవంత్ కేసరి’లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విలన్ రోల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. 'భగవంత్ కేసరి'లో రాహుల్ సంఘ్వి అనే పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనున్నారని చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. స్టైలిష్ సూట్ వేసుకుని, కుర్చీలో రాయల్‌గా కూర్చున్న అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
గిరిజన హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తగా...
ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందని సమాచారం. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆరు సినిమాలు ఓ లెక్క... ఇప్పుడు వస్తున్న ఏడో సినిమా 'భగవంత్ కేసరి'ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందట! కామెడీ కంటే కంటెంట్ ఎక్కువ హైలైట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా 'భగవంత్ కేసరి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటించారు. యువ కథానాయిక శ్రీ లీల (Sree leela) కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆమె పాత్ర చుట్టూనే కథ నడుస్తుందని టాక్. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial