అన్వేషించండి

Nagarjuna Akkineni: నాగార్జున ఎప్పుడో చేసేసిన ఆ సినిమాలు ఇప్పుడు చేసుంటే అన్నీ బ్లాక్ బస్టర్ లే!

కాలం కంటే ముందుకు అలోచించి చేసిన అడ్వాన్స్డ్ సినిమాలు నాగ్ సొంతం. అప్పటి ప్రేక్షకులకు అర్ధం కాక ప్లాప్ లూ, యావరేజ్ లుగా మిగిలిపోయిన సినిమాలు. ఇప్పుడు చెయ్యాల్సిన సినిమాలు ఎప్పుడో చేసేసిన నాగార్జున.

క్కినేని నాగార్జున ..!  గ్రేట్ అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన నాగ్ మొదట్లో ఆ భారాన్ని మొయ్యడానికి ఇబ్బంది పడినా.. త్వరలోనే తనకంటూ ప్రత్యేక ముద్రను వేయగలిగారు. 1990 నుంచి రెండు దశాబ్దాలు టాలీవుడ్ ను తమ భుజాలపై మోసిన నాలుగు పిల్లర్లలో ఒకరు ఆయన. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లే ఆ రెండు దశాబ్దాలకు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్. వీరిలో కమర్షియల్ మూవీస్ కి చిరంజీవి, మాస్ సినిమాలకు బాలకృష్ణ, సెంటిమెంట్ సినిమాలకు వెంకటేష్ కేరాఫ్ అడ్రెస్ గా మారితే.. నాగార్జున యూత్, ట్రెండీ, ఎక్సపెరిమెంట్స్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. వీటిలో కొన్ని టెక్నీకల్ గా అడ్వాన్స్డ్ మూవీస్ ఉండడం విశేషం. తెలుగు సినిమా మేకింగ్ ను పూర్తిగా మార్చేసిన ‘శివ’తో ఆర్జీవీని దర్శకుడిగా పరిచయం చేసింది నాగార్జునే. అయితే ఈ ప్రాసెస్ లో కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కారణం, అవి రిలీజ్ అయిన టైం కన్నా చాలా అడ్వాన్డ్ కథ, కథనాలతో రూపొందడమే. ఆ సినిమాలేంటో చూసేద్దామా?

1) అరణ్య కాండ (1986)

అప్పట్లో రైటర్ కొమ్మనాపల్లి గణపతి రావు రాసిన నవల పెద్ద హిట్. దాని ఆధారంగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అరణ్య కాండ. ఇది నాగార్జున మూడో సినిమా. అప్పటికి విక్రమ్, కెప్టెన్ నాగార్జున సినిమాల్లో మాత్రమే నటించి లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన నాగ్‌.. అరణ్య కాండ లాంటి యాక్షన్ మూవీలో జనానికి పెద్దగా అనలేదనే చెప్పాలి. పైగా అడవులు-పులి నేపథ్యంలో అంతకు ముందు ఏడాదే వచ్చిన వంశీ సినిమా ‘అన్వేషణ’ తరహాలో ఉంటుందని ఆంతా భావించారు. ఆ అంచనాలను అందుకోవడంలోనూ అడవుల్లో స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల గురించి ఇంకా ప్రేక్షకులందరిలో అవగాహన లేకపోవడంతో ఈ సినిమా యావరేజ్ గా మాత్రమే ఆడింది. 

2) నేటి సిద్దార్థ (1990)

1972 లో హాలీవుడ్ లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ ఎంత పెద్ద క్లాసిక్ అనేది అందరికీ తెలిసిందే. దాని ఆధారంగా భారతీయ భాషల్లో కనీసం 200 పైగా సినిమాలు రూపొందాయి. అయితే మొట్టమొదటిసారిగా ఇండియాలో గాడ్ ఫాదర్ ఆధారంగా రూపొందిన సినిమా ధర్మాత్మ (1975 ). అది బాలీవుడ్ లో పెద్ద హిట్. దానికి  హీరో, నిర్మాత, దర్శకుడు అన్నీ ఫిరోజ్ ఖాన్ నే. శివ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయిన నాగార్జునతో ధర్మాత్మ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు దర్శకుడు క్రాంతి కుమార్. లక్ష్మీ కాంత్-ప్యారేలాల్ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. అయేషా జుల్కా హీరోయిన్. తెలుగులో ఆమెకు అదే మొదటి సినిమా. ప్రధాన పాత్రలో కృష్ణం రాజు నటించగా కన్నడ ప్రభాకర్, ప్రదీప్ శక్తి, జేడీ చక్రవర్తి విలన్ లుగా కనిపిస్తారు. శోభన మరో హీరోయిన్ కాగా, కన్నడ హీరో దేవరాజ్ ప్రత్యేక పాత్రలో నటించారు. మాఫియా నేపథ్యంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. జనానికి ఆ మాఫియా గొడవలు, క్రైమ్ సిండికేట్ వ్యవహారాలు అంతగా ఎక్కలేదు. దానితో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ఈ సినిమా అబౌ ఏవరేజ్ గా మాత్రమే మిగిలింది. ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ సిద్దార్ధ. అయితే మాఫియా నేపథ్యంలో రూపొందిన సినిమాకు గౌతమ బుద్దుడి పేరేంటి అంటూ విమర్శలు రావడం తో నేటి సిద్దార్ధ గా మార్చారు. 

3) నిర్ణయం (1991)

మలయాళ దర్శకుడు 1987లో మోహన్ లాల్ తో వందనం అనే సినిమా తీశారు. దానికి 1987 హాలీవుడ్ సినిమా స్టేక్ అవుట్ సినిమా ఆధారం. దానిని తెలుగులో ప్రియదర్శన్ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు నిర్మాత, నటుడు మురళీ మోహన్. క్రైమ్-కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా అమల నటించగా మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నడిచే ఈ సినిమాలో ఒకానొక దశలో హీరో పాత్రకంటే మురళీమోహన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే, క్రైమ్ నూ కామెడీనీ కలపడం అప్పట్లో జనానికి పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో యావరేజ్ హిట్ గా మాత్రమే మిగిలింది ఈ సినిమా. ఇళయరాజా సంగీత దర్శత్వంలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా ‘హలో గురూ ప్రేమకోసమే రా జీవితం’ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన టైంలో మామూలు హిట్ గా నిలిచిన నిర్ణయం రానురానూ కల్ట్ సినిమాగా ప్రశంసలు అందుకుంది. 

4) చైతన్య (1991)

టాలీవుడ్ కి అప్పటివరకూ పరిచయం లేని జోనర్ రోడ్ మూవీని పరిచయం చేస్తూ రూపొందిన సినిమా చైతన్య. ఇటీవల మరణించిన నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో నాగార్జున, గౌతమి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. గిరీష్ కర్నాడ్, రఘువరన్, కోట, నీళగళ్ రవి, చిన్నా, సిల్క్ స్మిత లాంటి పేరున్న యాక్టర్స్ నటించినా.. సినిమా అంతా కార్ రేస్ ఆధారంగా ఉండడంతో అప్పటి ప్రేక్షకులను అంతగా  ఆకట్టుకోలేక పోయింది. ఇళయరాజా మ్యూజిక్ ఎప్పటిలానే సూపర్ హిట్ అయింది. 

5) శాంతి క్రాంతి (1991 )

బాహుబలి, RRR లాంటి సినిమాల గురించి ఇప్పుడెలా మేకింగ్ టైం నుండే ఎలా మాట్లాడుకున్నామో, 1991లోనే ఆస్థాయిలో ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకున్న సినిమా శాంతి క్రాంతి. హై బడ్జెట్ తో కన్నడలో రవిచంద్రన్, తమిళంలో రజనీకాంత్, తెలుగులో నాగార్జున హీరోలుగా ఒకేసారి మూడు భాషల్లో రూపొందిన మల్టీ స్టారర్ సినిమా ఇది. జుహీ చావ్లా, ఖుష్బూలు హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా కన్నడ హీరో అనంత్ నాగ్. విలన్ గా నటించారు, పాటలన్నీ సూపర్ హిట్. అయితే సినిమా మొత్తం కిడ్నీ రాకెట్ బేస్డ్ గా సాగుతుంది. అప్పటి ప్రేక్షులకు అది అర్ధం కాలేదు. పైగా రవిచంద్రన్ స్రీన్ ప్లే గజిబిజిగా ఉండడం కూడా ఆడియన్స్ ను ఆకట్టుపోలేక పోవడం మరో రీజన్. 

6) జైత్ర యాత్ర (1991)

ఇటీవల విరాట పర్వం గురించి ఎంతెలా ఇండస్ట్రీ  మాట్లాడుకుందో అలాంటి సినిమానే నాగ్ 1991 లోనే తీసిన సంగతి ఇప్పటి జెనరేషన్ కు పెద్దగా తెలియదు, అదే జైత్రయాత్ర. విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో పాటలన్నీ బాగుంటాయి. ధనవంతులు చేసే నేరాలకు పేదవాళ్ళు ఎలా బలవుతుంటారు, అక్రమ కేసుల్లో ఇరుక్కుని జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారు లాంటి సీరియస్ అంశాలను ఈ సినిమా చర్చిస్తుంది. అయితే యాక్షన్ హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్న సమయంలో నాగార్జున ఇలాంటి సినిమా చెయ్యడం నాటి ఆడియన్స్ కు మింగుడుపడలేదు. కానీ, ఇప్పటికీ నాగార్జున కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా జైత్ర యాత్ర మిగిలిపోయింది. ఈ సినిమా పరాజయానికి ఆ టైటిల్ కూడా ఒక కారణం. జైత్రయాత్ర అనగానే ఏదో యాక్షన్ మూవీ అని అంతా అనుకుంటే అదికాస్తా సీరియస్ ఇష్యుని చర్చిస్తూ సాగడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు పనితనం నచ్చి నాగార్జున తరువాత తన సినిమా ‘రక్షణ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అది సూపర్ హిట్ అయింది. 

7) ‘చంటి’ దెబ్బకు ‘కిల్లర్’ (1992) విలవిల

కిల్లర్  సినిమా బాగుంటుంది. హిట్ అయింది.. 100 రోజులు ఆడింది.. ఇళయరాజా పాటలన్నీ హిట్. అయినా కూడా నాగార్జున అభిమానుల్లో ఏదో అసంతృప్తి. కారణం చంటి మూవీ. 10, జనవరి 1992న ఒకేరోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలూ హిట్ అయినా మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో చంటి బ్లాక్ బస్టర్ గా మారింది. దాని ప్రభావం నాగార్జున కిల్లర్ మీద పడింది. లేకుంటే అది కూడా పెద్ద హిట్ అయి ఉండేదని సినీ విశ్లేషకులు అంటుంటారు. నగ్మా హీరోయిన్ గా, శారద, తులసి, విజయ్ కుమార్, బెనర్జీ తదితరులు నటించిన ఈ సినిమాకు మలయాళ దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడే పుష్పలో విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కావడం విశేషం. 

8) క్రిమినల్ (1994)

"తెలుసా.. మనసా.." అనే పాట వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంత క్లాసికల్ హిట్ అయిన పాట క్రిమినల్ సినిమాలోది. 1993లో హాలీవుడ్ లో వచ్చిన ఫ్యుజిటివ్ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రీమేక్ చేశారు దర్శకుడు మహేష్ భట్. రెండు భాషల్లోనూ నాగార్జునే హీరో కాగా మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ హీరోయిన్ లుగా యాక్ట్ చేశారు. గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలో నటించారు. పాటలు హిట్ అయ్యాయి, సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. అయితే సినిమాలో సగభాగం హీరో డీ-గ్లామర్ గా కనపడడం, ఈ సినిమాకు ముందు హలొ బ్రదర్ లో చలాకీగా కనపడే నాగార్జున క్రిమినల్ లో నెమ్మదిగా ఉండడం జనానికి పెద్దగా ఎక్కలేదు. అయితే ఈ సినిమా హిందీలో మాత్రం పెద్ద హిట్ అయింది. అలాగే కీరవాణి అందించిన మ్యూజిక్ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది.

9) వజ్రం( 1995) - ముందే వచ్చిన 3 ఇడియట్స్ 

చిన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ లు కొడుతూ టాప్ పొజిషన్ లో ఉన్న దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో నాగార్జున సినిమా అనగానే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వజ్రం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మలయాళ సినిమా స్పటికం ఆధారం. నాగ్ సరసన రోజా హీరోయిన్‌గా నటించారు. పిల్లలను ఆశక్తి ఉన్న రంగంలో కాకుండా వాళ్ళను బలవంతంగా పెద్దలకు నచ్చిన సబ్జెక్ట్ లనే చదవాలని పట్టుపట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందనే కథతో వచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాగార్జున మాస్ రేంజుకూ, కృష్ణారెడ్డి కామెడీ టైమింగ్ కూ ఏమాత్రం సంబంధం లేని కథ కావడంతో అంచనాలు అందుకోలేక పోయింది. అయితే, ఇంచుమించు ఇదే కథతో చాలా ఏళ్ల తర్వాత హిందీ త్రీ ఇడియట్స్ తీసి సూపర్ హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరాణీ. 

10) రక్షకుడు(1997)

నాగార్జున హీరో, మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ హీరోయిన్. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్. జెంటిల్మెన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన కేటీ కుంజుమోన్ నిర్మాత. కొత్త దర్శకుల టాలెంట్ ను నమ్మే నాగార్జున మరో కొత్త దర్శకుడు ప్రవీణ్ గాంధీకి ఇచ్చిన అవకాశం ‘రక్షకుడు’.  నాటి బడ్జెట్ హద్దులన్నీ చెరిపేస్తూ తీసిన సినిమా ఇది. గిరీష్ కర్నాడ్, రఘువరన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు లాంటి పేరున్న నటులు యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమా అనుకున్నంత హిట్ అయ్యుంటే తెలుగు, తమిళ్ భాషల్లో నాగార్జున ఒక్కడే టాప్ లో ఉంటాడని అందరూ అంచనాలు వేశారు. అందుకే నాగార్జునకు ఉన్న యువసామ్రాట్ టైటిల్ బదులు సౌత్ ఇండియన్ సుప్రీమో అనే టైటిల్ వాడారు. అయితే ఆనాటికి అంతగా పరిచయం లేని కార్పొరేట్ రైవల్రీ జోనర్ లో ఈ సినిమా రూపొందడం, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ హీరో చేతులు కట్టేసుకుని ఉండడం నాగ్ అభిమానులకే ఎక్కలేదు. పైగా ఎక్కువ తమిళ వాసనలు కూడా మనవాళ్లకు పెద్దగా నచ్చ లేదు. దానితో అనుకున్న రేంజ్ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది ఈ సినిమా. 

టైమింగ్ సరిగ్గా లేక అనుకున్నంత హిట్ కానీ ఈ సినిమాలు, ఇప్పుడు గనుక రిలీజ్ అయ్యుంటే అన్నీ బ్లాక్ బస్టర్ లు అయ్యుండేవి అని అంటుంటారు ఫిల్మ్  క్రిటిక్స్, అయితే నాగార్జున సినిమాల విషయంలో ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు అనడానికి ఈ సినిమాలు నిదర్శనం అని అంటారు ఆయన అభిమానులు. 

Also Read: 'వాసివాడి తస్సాదియ్యా' - మన్మథుడిలో మాస్ ఉంది, కింగ్ లాంటి క్లాస్ ఉంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Embed widget