Nagarjuna Remake Movie: ఆ మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి రీమేక్ - హీరోగా అక్కినేని నాగార్జున?
మలయాళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున హీరోగా నటించనున్నారు. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చివరి సినిమా ‘ది ఘోస్ట్’. ఈ సినిమాపై ఆయనతో పాటు ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నాగ్ కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఈ చిత్రం చేరిపోయింది. ఈ సినిమా దెబ్బకు నాగార్జున అలర్ట్ అయ్యారు. తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి స్క్రీప్ట్ గురించి తెలుసుకున్నాకే, ఆయన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Here's the intense Guns and Swords action video🔥🔥🔥
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 22, 2022
▶️ https://t.co/XjAsFKMAKf
You're in for a high-octane ride, you have my (s)word⚔️#TheGhostonOct5 @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @SonyMusicSouth pic.twitter.com/tUYp7Tku5w
‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత, ఆయన చేయబోయే సినిమా ఏంటో ఇప్పటి వరకు అఫీషియల్ గా వెల్లడించలేదు. కానీ, మూడు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి రీమేక్ అవుతోందట. ఇందులో నాగార్జున హీరోగా చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ దర్శకుడు నాగ్ తో చర్చలు జరిపారట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, ‘పొరింజు మరియం జోస్’. ఈ చిత్రానికి సంబంధించిన రీమేర్ హక్కులను నిర్మాత అభిషేక్ అగర్వాల్ దక్కించుకున్నారట. ఇటీవల, ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఈయనే నిర్మాతగా వ్యవహరించారు. ‘పొరింజు మరియం జోస్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసి, పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.
మలయాళ రీమేక్ కు ఓకే చెప్పిన నాగార్జున?
ఇక ఈ రీమేక్ సినిమాకు ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే నాగార్జున సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అటు రవితేజ సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ధమాకా’కు రచయితగా పని చేసిన ప్రసన్నతో నాగార్జున ఓ సినిమా చేస్తున్నారట. అయితే, ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ప్రకటన రావాల్సి ఉంది.
‘బ్రహ్మాస్త’ మూవీలో నటనకు ప్రశంసలు
అటు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బ్రహ్మాస్త’ ఈ మధ్య కాలంలో నాగార్జునకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాగార్జున నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
Iam proud to show you the Trailer of Brahmāstra!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 15, 2022
Excited to give you a glimpse of the extraordinary world of Ancient Indian Astras🔥🔥
Brahmāstra Part One: Shiva - September 9th. Only in Cinemas!https://t.co/puOQGII1TB
Read Also: ముక్కలు చేస్తే అలాగే ఉంటుంది - ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జీవీ