అన్వేషించండి
Advertisement
Nagababu: 'కండబలం, డబ్బు బలానికి లొంగిపోయారు' నాగబాబు ఓపెన్ లెటర్..
'మా' సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగబాబు తాజాగా ఓ లెటర్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా).. ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించిన వెంటనే.. ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేసిన కొణిదెల నాగబాబు 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిపై తాజాగా ఓ లెటర్ ను కూడా విడుదల చేశారు.
Also Read: 'నన్ను ఎలెక్షన్స్ నుంచి సైడైపోమని చెప్పిందే చిరంజీవి అంకుల్..' మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..
''ఎలాంటి భేషజాలు, పక్షపాతం లేకుండా పనిచేసే 'మా' అసోసియేషన్ ను నేను ఎంతో అభిమానించేవాడిని. ఇతర ప్రాంతాలకు చెందిన నటీనటులను ఆహ్వానించడంతో పాటు మనలో కుటుంబసభ్యులుగా వాళ్లను చూసేది 'మా'. అందుకే గతంలో నేను ఈ అసోసియేషన్ కి సంబంధించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేశాను. కానీ ఇప్పుడు 'మా' సభ్యుల్లో నటులుగా, మనుషులుగా అసహ్యమైన మార్పొచ్చింది. ఈ ఎలెక్షన్ నాలాంటి వాళ్లకు అసోసియేషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుందో నిరూపించింది. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వం తో 'మా' కొట్టుమిట్టాడుతోంది. కండ బలం, డబ్బు బలానికి 'మా' సభ్యులు లొంగిపోయి.. కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నారు. ఈ కారణాల వలనే నేను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ కపట, దుర్భరమైన మనుషులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రాంతం, మతం అనే సాకుతో తమ సమాధులకు తామే గోతులు తవ్వుకున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి గౌరవప్రదమైన మనుషులకు నేనెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. గతంలో జరిగిన పరిస్థితులకు నేను చింతించడం లేదు. కానీ భవిష్యత్తులో ఈ అసోసియేషన్ పరిస్థితి ఏమవుతుందనే భయం మాత్రం ఉంది'' అంటూ రాసుకొచ్చారు.
మరి దీనిపై మంచు విష్ణు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి. ముందైతే.. నాగబాబు రాజీనామా యాక్సెప్ట్ చేయనని.. ఆ విషయాన్ని వ్యక్తిగతంగా కలిసి చెప్తానని మంచు విష్ణు అన్నారు. మరిప్పుడు ఏం చేస్తారో!
Membership Resignation from MAA Association. pic.twitter.com/l4WlNaZlvx
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 11, 2021
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion