News
News
X

Naga Chaitanya: ఆ అవసరం నాకు లేదు, సమంతతో విడాకులపై దిమ్మతిరిగే జవాబిచ్చిన నాగచైతన్య

సమంతతో విడాకులపై అక్కినేని నాగ చైతన్య ఎట్టకేలకు పెదవి విప్పాడు. అయితే, చైతూ మరో వివాదానికి అవకాశం లేకుండా మాట్లాడాడు.

FOLLOW US: 

క్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంది. అంత గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న ఆ జంట అంత త్వరగా ఎలా విడిపోయారంటూ రకరకాల వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. సమంత, నాగచైతన్య ఎక్కడికెళ్లినా.. వారికి మీడియా నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న కూడా అదే. అయితే, నాగచైతన్య ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నా. సమంత మాత్రం విడాకుల తర్వాత తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటోంది. 

ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో కరణ్ జోహర్ మీ భర్త అని సంబోంధించడంతో.. ‘‘భర్త కాదు, మాజీ భర్త అనండి’’ అని కరెక్ట్ చేయడం వివాదాస్పదమైంది. అంతటితో ఆగకుండా తాను రూ.250 కోట్లు తీసుకున్నట్లు వచ్చి రూమర్స్ మీద కూడా సమంత స్పందించింది. ఆ వదంతులు విన్నప్పుడు తన ఇంటిపై ఐటీ రైడ్స్ చేస్తారేమో అని ఎదురుచూశానని సమంత చెప్పుకొచ్చింది. తమ విడాకులు అంత సామరస్యపూర్వకంగా జరగలేదని స్పష్టం చేసింది. 
 
అయితే, నాగ చైతన్య మాత్రం తన విడాకుల విషయంలో భిన్నంగా స్పందిస్తున్నాడు. విడాకుల తర్వాత వచ్చిన ట్రోల్స్, పుకార్లపై మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘‘మా విడాకులపై వస్తున్న వార్తలు ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తున్నాయి. నేను నటుడిగా.. నా వృత్తి జీవితం మాట్లాడాలని అనుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం చర్చనీయాంశం కావడం నాకు ఇష్టం లేదు. మనందరికీ పర్శనల్ స్పేస్ అనేది ఒకటి ఉంది. దానిని 'పర్శనల్' అని పిలవడానికి ఒక కారణం ఉంది’’ అని తెలిపాడు.

‘‘సమంత, నేను ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పేశాం. మా విడాకులపై ఒక ప్రకటన కూడా చేశాం. నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే నేను బయటకు చెబుతాను. అది మంచిదైనా చెడ్డదైనా మీడియాకు తెలియజేస్తాను. కానీ, మా విడాకుల గల కారణాలేమిటనేది ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం నాకు లేదు. నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందరికీ మా విడాకుల గురించి తెలుసు. ఉహాగానాలు చాలా తాత్కాలికం. నేను వాటిపై స్పందిస్తే.. మరిన్ని వార్తలు పుడతాయి. కాబట్టి, నేను దాని గురించి మాట్లాడను’’ అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరికీ పర్శనల్ లైఫ్ ఉంటుందని, దాని గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదని చైతు అన్నాడు.

 నాగచైతన్య, సమంతా రుతుప్రభు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి విడాకులు అభిమానులను చాలా ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో సమంతపై కూడా దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె కొద్ది రోజులు మానసిక ఆందోళనకు గురైంది. షూటింగ్స్ పక్కన పెట్టి.. స్నేహితులతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేసింది. ఇప్పుడు సమంత వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వచ్చిన పాపులారిటీ నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మరోవైపు నాగ చైతన్య కూడా ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.  

Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి

Also Read: హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్

View this post on Instagram
 
A post shared by Chay Akkineni (@chayakkineni)

Published at : 31 Jul 2022 09:13 PM (IST) Tags: Naga Chaitanya Naga Chaitanya Samantha Divorce Samantha Divorce Naga Chaitanya Divorce Naga Chaitanya On Divorce

సంబంధిత కథనాలు

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

టాప్ స్టోరీస్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!