By: ABP Desam | Updated at : 11 Feb 2023 09:47 AM (IST)
'కోనసీమ థగ్స్'లో హ్రిదు హరూన్
యువ గాయకులలో కాల భైరవది ప్రత్యేక శైలి. ఎటువంటి పాటను అయినా సరే చాలా అవలీలగా పాడగలడు. ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిన 'నాటు నాటు...' పాడింది అతనే. ఆ సినిమాలో 'కొమురం భీముడో...' పాటనూ (Kala Bhairava Songs) అతనే ఆలపించారు. ఇప్పుడు కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో కాల భైరవ గాత్రం, హ్రిదు హరూన్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వీర శూర మహంకాళి...
'కోనసీమ థగ్స్'లో కొత్త పాట
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కోనసీమ థగ్స్'. హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ 'పులి', విక్రమ్ 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్'తో పాటు హిందీ సినిమా 'ముంబైకర్' నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ సింహ (Bobby Simha), ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య తారాగణం. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నారు.
KonaSeema Thugs Movie Songs : 'కోనసీమ థగ్స్' సినిమాలోని తొలి పాట 'వీర శూర మహంకాళి వస్తోందయ్యా...'ను తాజాగా విడుదల చేశారు. కాళికా అమ్మవారి ఊరేగింపు నేపథ్యంలో వచ్చే గీతమిది. సామ్ సిఎస్ బాణీ అందించగా... కాల భైరవ గీతాన్ని ఆలపించారు.
'వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా...' అంటూ వనమాలి సాహిత్యం అందించారు. చెడును అంతం చేయడానికి వచ్చే అమ్మవారి కోపాన్ని, క్రోధాన్ని తెలిపేలా ఆయన సాహిత్యం ఉంది.
Also Read : హాట్‌స్టార్‌లో తమన్నా సిరీస్ - చిరు, రజనీ సినిమాలపై మిల్క్ బ్యూటీ అప్డేట్స్!
ఇటీవల 'కోనసీమ థగ్స్' తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. రా అండ్ రస్టిక్ థీమ్‌తో ఆ ట్రైలర్ సాగింది. అందులో ఏ ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ఇంట్రడ్యూస్ చేశారు. హత్య చేసి జైలుకు వచ్చిన అనాథగా హ్రిదు హరూన్ కనిపించారు. అప్పటికి జైల్లో ఉన్న వ్యక్తులుగా మునిష్కంత్, బాబీ సింహాను చూపించారు. వాళ్ళంతా కలిసి ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. అయితే... ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. సెకండ్ అటెంప్ట్ ఎలా చేశారు? ఏమైంది? అనేది సినిమా. పోలీస్ రోల్ చేసిన ఆర్.కె. సురేష్ వీళ్ళను ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి. యాక్షన్ ఎపిసోడ్స్ & రస్టిక్ ఫీల్ హైలైట్ అయ్యాయి.
Also Read : 'అమిగోస్' రివ్యూ : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
హ్రిదు హరూన్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా 'థగ్స్'. ఆయన వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. అంటే... హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద తొలి సినిమా. కానీ, నటుడిగా కాదు! అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన క్రాష్ కోర్స్ వెబ్ సీరీస్ (Crash Course Web Series) లో హ్రిదు హరూన్ నటించారు. అందులో సత్య శ్రీవత్సన్ పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'మంబైకర్'లో కూడా ఆయన నటించారు.
ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా... 'ఆర్ఆర్ఆర్' ప్రోమో ఎడిటర్‌గా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ డిజైనర్ : జోసెఫ్ నెళ్లికల్, యాక్షన్ : ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ముత్తు కురుప్పయ్య, కాస్ట్యూమ్స్ : మాలిని కార్తికేయన్.
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్