Pankaj Udhas Passes Away : ప్రముఖ మ్యూజిక్ లెజెండ్ గజల్ పంకజ్ ఉదాస్ అనారోగ్యంతో కన్నుమూత
Legendry Singer Pankaj Udhas : బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ పంకజ్ ఉదాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు.

Pankaj Udhas Death : ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్యాంసుడు పంకజ్ ఉదాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాసను విడిచారు. ఈ వార్తను పంకజ్ కుమార్తె నయాబ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ వార్తతో బాలీవుడ్ సెలబ్రెటీలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషలో మీడియాలో పోస్ట్‌లు, స్టోరీలు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పంకజ్‌కు నివాళి తెలిపారు.
గుజరాత్‌లోని జెటూర్‌లో 1951లో పంకజ్ జన్నించారు. చదువుకునే సమయంలో ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. ముగ్గురు సోదరులలో పంకజ్ చిన్నవారు. ఇతని పెద్ద అన్న మన్హర్ ఉదాస్ బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. రెండో అన్న నిర్మల్ ఉదాస్ కూడా గజల్ సింగర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. పంకజ్ ఉదాస్ కూడా వారి అన్నల మార్గంలోనే వెళ్లారు. ఆయన తండ్రి కూడా వాయిద్యాలు ప్లే చేస్తూ ఉండేవారు. తండ్రి, అన్నలను చూసిన పంకజ్‌కు కూడా మ్యూజిక్‌పై ఆసక్తి కలిగి.. అటువైపే తన కెరీర్‌ను మొదలుపెట్టారు.
తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో చాందీ జైసా రంగ్ అనే పాటతో పంకజ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1970లో తొలిసారి దీనిని పాడి కెరీర్‌ను మొదలు పెట్టారు. మన్హర్ ఉదాస్తో కలిసి తన మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాలు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు. 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బమ్ మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ముకరర్, తర్రన్నమ్, మెహ్ఫిల్, నయాబ్ వంటి అనేక హిట్లను అందించారు. 1986లో నామ్ అనే సినిమాలో చిట్టి ఆయా హై పాటతో ఆయనకు గుర్తింపు వచ్చింది. దాదాపు 16 సంవత్సరాల సినీ కెరీర్లో ఆయనకు ఈ పాటతో మంచి బ్రేక్ దొరికింది.
చిట్టి ఆయా హై పాట తర్వాత మూడు దశాబ్ధాల పాటు.. పంకజ్ తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే, తోడి తోడి పియా కరో వంటి ఎన్నో అద్భుతమైన బాలీవుడ్ సాంగ్స్‌ను ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను కూడా ఆయన రిలీజ్ చేశారు. సింగర్‌గా కంటే గజల్ సింగర్‌గా ఎక్కువ పేరును సంపాదించుకున్నారు. సింగర్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. గజల్స్‌లో ఆయన చేసిన సేవలు గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
భారతీయ సంగీత ప్రపంచంలో గజల్, నేపథ్య గాయకుడిగా పంకజ్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు ఎందరినో ఆకట్టుకున్నాయి. లత మంగేష్కర్తో కలిసి ఆయన పాడిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ అయినట్లు చెప్తారు. ఘాయల్ సినిమాలో మహియా తేరా కసమ్ అనే డ్యూయెట్ బాగా హిట్ అయింది. 1970 నుంచి 2016 వరకు ఆయన సంగీత ప్రపంచలో తన కాంట్రిబ్యూషన్ అందించారు. వయసు రీత్యా దీనికి బ్రేక్ తీసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ నిన్న (ఫిబ్రవరి 26) ముంబైలో కన్నుమూశారు.
Also Read : ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























