Thaman: పవన్‌కల్యాణ్ పర్సనల్ వీడియోస్ ఉన్నాయి. అవి మీకు చూపించనుగా! - తమన్
ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కొంతమందిని సంగీత దర్శకుడు తమన్ బ్లాక్ చేశారు. ఆ విషయం అడిగితే... ఆయన ఏమన్నారు? తన దగ్గర ఉన్న పవన్‌కల్యాణ్ వీడియోలను ఎందుకు విడుదల చేయనన్నారు? తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్. 'వకీల్ సాబ్'తో తొలిసారి పవన్ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఆయనకు వచ్చింది. అందులోని 'మగువా మగువా...' పాట శ్రోతల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా మహిళలకు ఆ పాట నచ్చింది. మిగతా పాటలూ హిట్టయ్యాయి. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'కు కూడా తమనే సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఇందులో మూడు పాటలు విడుదలయ్యాయి. తొలుత 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఆ తర్వాత పవన్, నిత్యా మీనన్ మీద తెరకెక్కించిన 'అంత ఇష్టం' మెలొడీ విడుదల చేశారు. తాజాగా 'లా... లా... భీమ్లా' విడుదలైంది. 'భీమ్లా నాయక్'లో పాటలు ఎక్కువగా మాస్‌ను, యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అభిమానులకు నచ్చాయి. ఈ సందర్భంగా ట్విట్టర్ స్పేస్‌లో పవన్ అభిమానులతో తమన్ కొంతసేపు మాట్లాడారు.
"నేను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. 123 సినిమాలు చేశాక... ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణం త్రివిక్రమ్ గారే. ఆయనకు థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన పవన్ కల్యాణ్ గారికి థ్యాంక్స్. ఓ సంగీత దర్శకుడిగా కథకు ఏం కావాలనేది ఆలోచిస్తూ... అభిమానిగా ఎటువంటి పాటలు ఉంటే బావుంటుందని ఆలోచించి పాటలు చేస్తా. ప్రేక్షకులు అందరికీ పాటలు నచ్చడం చాలా సంతోషంగా ఉంది" అని తమన్ అన్నారు. ఆ తర్వాత అభిమానుల తరఫున ఒకరు మాట్లాడుతూ 'కొంతమందిని ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. వాళ్లను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించండి' అని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు తమన్ మాట్లాడుతూ "నేనూ అభిమానినే. ఎందుకు బ్లాక్ చేస్తాం? ఏదో తప్పుగా మాట్లాడితేనే కదా! సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడకూడదు కదా!" అని అన్నారు.
'భీమ్లా నాయక్' పాటలను పవన్ కల్యాణ్ చాలా ఎంజాయ్ చేశారని తమన్ తెలిపారు. అప్పుడు వీడియోలు కూడా తీసుకున్నానని అన్నారు. ఆ వీడియోలు విడుదల చేయాల్సిందిగా అభిమానులు కోరితే... "సారీ బ్రదర్! అవి పర్సనల్. నేను బయటకు విడుదల చేయలేను" అని తమన్ స్పష్టం చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పవన్ చాలా ఎంజాయ్ చేస్తారనేది 'అత్తారింటికి దారేది'లోని 'కాటమరాయుడా... కదరి నరసింహుడా' సాంగ్ మేకింగ్, 'అజ్ఞాతవాసి'లోని 'కొడకా... కోటేశ్వరరావు' సాంగ్ మేకింగ్ చూస్తే తెలుస్తుంది.
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
AlsoRead: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంటకు డడన! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి