MS Dhoni: నయనతారతో ధోనీ సినిమా - క్లారిటీ ఇచ్చిన టీమ్
నయనతారతో ధోనీ సినిమాపై క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ.
స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొన్నాళ్లక్రితం ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో సొంతంగా బ్యానర్ మొదలుపెట్టారు ధోనీ. ఇప్పుడు ఈ బ్యానర్ లో నయనతార హీరోయిన్ గా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఈ సినిమాలో ధోనీ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అన్నారు. ఈ సినిమాను రజినీకాంత్ సన్నిహితుడు సంజయ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆయన దగ్గరున్న ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ తో సినిమా చేయబోతున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశల్లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వార్తలు ఎక్కువ అవుతుండడంతో ధోనీ టీమ్ స్పందించక తప్పలేదు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
సంజయ్ అనే వ్యక్తితో ధోనీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదని.. అతడితో ఎలాంటి కొలాబిరేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మొద్దని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటికైతే తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నట్లు త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తామని పేర్కొంది. దీంతో నయనతారతో ధోనీ సినిమా చేయడం లేదనే విషయం కన్ఫర్మ్ అయింది.
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 12, 2022
ఇదిలా ఉండగా.. ఇటీవల నయన్ తన బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్ లో నటించిన 'కాతు వాక్కుల రెండు కాదల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నయన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల నయన్ ముంబైకి కూడా వెళ్లింది.
View this post on Instagram
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?