By: Satya Pulagam | Updated at : 21 Nov 2022 08:55 AM (IST)
థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న సినిమాలు
'యశోద' (Yashoda) తర్వాత తెలుగులో భారీ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. గత శుక్రవారం 'మసూద', 'గాలోడు' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఓటీటీలో 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్, 'ఐరావతం' సినిమా వచ్చాయి. తెలుగులో ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు. 'అల్లరి' నరేష్ హీరోగా నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఒక్కటే పేరున్న సినిమా. దాంతో పాటు హిందీ అనువాదం 'తోడేలు', తమిళ అనువాదం 'లవ్ టుడే' సినిమాలు సందడి చేయనున్నాయి.
'తోడేలు' కరిచిన తర్వాత ఏమైంది?
తెలుగులో ఈ వారం విడుదల అవుతున్న సినిమాల్లో క్రేజ్ ఉన్న సినిమా 'తోడేలు' (Thodelu Movie). హిందీ సినిమా 'భేడియా'కు అనువాదం ఇది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించారు. హీరోకి తోడేలు కరుస్తుంది, ఆ తర్వాత ఏమైంది? తోడేలుగా మారిన హీరో ఏం చేశాడు? అనేది సినిమా. ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. 2డీ, 3డీలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.
'కాంతార', 'ఊర్వశివో రాక్షసివో' విజయాల తర్వాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న చిత్రమిది. మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచెయ్'లో కృతి సనన్ నటించడం, అల్లు అరవింద్ విడుదల చేస్తుండటం, ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా ఉండటం సినిమాకు ప్లస్ అని చెప్పాలి.
నరేష్ నుంచి మరో సీరియస్ సినిమా!
నరేష్ హీరోగా నటించిన తొలి సినిమా 'అల్లరి' ఆయన ఇంటి పేరు అయింది. ఆ తర్వాత ఆయన ఎన్నో వినోదాత్మక సినిమాలు చేశారు. కానీ, మధ్య మధ్యలో ఆయన చేసిన సీరియస్ సినిమాలు విజయాలు సాధించాయి. నటుడిగా ఆయనకు పేరు తీసుకు వచ్చాయి. స్పూఫ్ కామెడీ సినిమాలు ఫెయిల్ కావడంతో నరేష్ సీరియస్ సినిమాలపై దృష్టి పెట్టారు. 'నాంది'తో హిట్ కొట్టారు. ఇప్పుడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'లో 'అల్లరి' నరేష్ ఎన్నికల అధికారిగా నటించారు. కొండ మీద గిరిజన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా ప్రాణాల కోసం ఆయన ఎటువంటి రిక్స్ చేశారనేది కథ. ఆనంది కథానాయికగా నటించిన ఈ సినిమాలో 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్, సంపత్ తదితరులు నటించారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. రాజేష్ దండ నిర్మించారు.
ఫోన్ ఇతరులకు ఇవ్వాలంటే భయపడాలి!
తమిళ సినిమా 'లవ్ టుడే' (Love Today Telugu Release Date) తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం (నవంబర్ 25న) విడుదల అవుతోంది. నిజానికి, గత వారం విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, రాలేదు. ఇద్దరు ప్రేమికులు ఒకరి ఫోన్ మరొకరికి ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది 'లవ్ టుడే' కాన్సెప్ట్. ట్రైలర్ బావుంది. సినిమాపై మంచి బజ్ ఉంది.
ఆల్రెడీ తమిళంలో సినీ ప్రముఖులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ అతడిని అభినందించారు.
Also Read : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
తెలుగులో ఈ వారం కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. శుక్రవారం (నవంబర్ 25న) 'వల', 'మన్నించవా' చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఆ తర్వాత రోజైన శనివారం (నవంబర్ 26న) 'రణస్థలి' విడుదలకు రెడీ అయ్యింది.
హిందీలో 'భేడియా'కు ఎదురులేదు!
తెలుగులో 'తోడేలు'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'భేడియా'కు హిందీలో ఈ వారం ఎదురు లేదని చెప్పాలి. అక్కడ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతి సనన్ జోడీకి తోడు నిర్మాత దినేష్ విజయన్ బ్రాండ్ వేల్యూ యాడ్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బావున్నాయి. అదీ సంగతి!
శుక్రవారమే 'కొరా కాగజ్'!
'భేడియా'తో పాటు ఈ శుక్రవారం హిందీలో విడుదలవుతున్న మరో సినిమా 'కొరా కాగజ్'. అందులో రజత్ కపూర్, స్వస్తిక ముఖర్జీ, ఐషాని యాదవ్ తదితరులు నటించారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రెస్ట్ ఉంది.
Also Read : కొన్నేళ్ళుగా కృష్ణ దినచర్య ఇదే - ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే?
ఇతర భాషల్లో ఈ శుక్రవారం విడుదల అవుతున్న సినిమాలకు వస్తే...
Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి
Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన
/body>