Money Heist Korea Trailer: ‘మనీ హీస్ట్’ కొరియా ట్రైలర్ - కొత్త ప్లాన్, సరికొత్త ట్విస్టులతో వచ్చేస్తున్న ప్రొఫెసర్ అండ్ టీమ్!
మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మనీ హీస్ట్’ కొరియా వెబ్ సీరిస్ వచ్చేస్తోంది. జూన్ 24న విడుదల కానున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ఇక్కడ చూసేయండి.
స్పానిష్ వెబ్ సీరిస్ ‘మనీ హీస్ట్’ ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే. ఈ షో తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదలై మాంచి రేటింగ్ సాధించింది. నెట్ ఫ్లిక్స్‌కు అత్యధిక ఆదాయాన్ని ఇచ్చిన వెబ్ సీరిస్‌ల్లో ‘మనీ హీస్ట్’ ఒకటి. ఐదు సీజన్ల తర్వాత ‘మనీ హీస్ట్’కు పుల్‌స్టాప్ పెట్టడం.. అభిమానులకు అస్సలు నచ్చలేదు. మళ్లీ అలాంటి సీరిస్ కావాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు కొరియా వెబ్ సీరిస్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, అంతా అదే కథ అవే సీన్స్ ఉంటాయని భావించారు. తాజాగా విడుదలైన ‘మనీ హీస్ట్: కొరియా - జాయింట్ ఎకనామిక్ ఏరియా(Money Heist: Korea – Joint Economic Area) సీజన్-1 ట్రైలర్ చూస్తే.. మళ్లీ ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.
స్పానిష్ ‘మనీ హీస్ట్’లో అల్వారో మోర్టే పోషించిన ప్రొఫెసర్ పాత్రలో కొరియా స్టార్ యూ జీ-టే నటిస్తున్నాడు. జూన్ 24 నుంచి ఈ వెబ్ సీరిస్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజనల్ ‘మనీ హీస్ట్’లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ వెబ్ సీరిస్ అభిమానులు అందులోని పాత్రల గురించి నిద్రలో అడిగినా తడబడకుండా చెప్పేస్తారు. ప్రొఫెసర్‌తోపాటు బెర్లిన్, టోక్యో, రియో, హెల్సింకీ, నైరోబీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ ప్లాన్స్.. ఏ క్షణంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడనేవి ఎవరికీ అంతుబట్టకుండా ఉంటాయి. అందుకే ఈ షో అందరికీ నచ్చేసింది. అయితే, కొరియా ‘మనీ హీస్ట్’ కేవలం ఆ దేశంలోనే విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, ఇది ఇండియా ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. కాబట్టి, జూన్-24న ఈ వెబ్ సీరిస్ చూసేందుకు సిద్ధమైపోండి. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ చూడండి.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు,
View this post on Instagram