అన్వేషించండి

Raja Singh: జీ స్టూడియోస్‌ను బ్యాన్ చేయండి, అతడిని అరెస్ట్ చేయండి - నయనతార ‘అన్నపూర్ణి‘పై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

Raja Singh: నయనతార ‘అన్నపూర్ణి‘ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్‌ను నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ సినిమా దర్శకుడు నీలేష్ కృష్ణను అరెస్ట్ చేయాలన్నారు.

Raja Singh On Nayanthara Annapoorani Movie: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ సినిమా దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఈ సినిమాపై పలు హైందవ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సినిమాను నిషేధించడంతో పాటు మేకర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెట్టాయి. వివాదం ముదరడంతో ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని తొలగించింది. తాజాగా ఈ సినిమా వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

జీ స్టూడియోస్ ను బ్యాన్ చేయండి- రాజాసింగ్

‘అన్నపూర్ణి’ సినిమా హిందువులను అవమానించేలా ఉందని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను తీసే దర్శకులతోపాటు నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని చెప్పిన ఆయన, భవిష్యత్ లో మళ్లీ రాకుండా ఉండేలా సీరియస్ యాక్షన్ అవసరం అన్నారు. “అన్నపూర్ణి’ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. క్షమాపణలు చెప్పినా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. గతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా సినిమాలు వచ్చాయి. పలుమార్లు వివాదం చెలరేగినా, క్షమాపణలతో సరిపెట్టాయి. అందుకే, ఈ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ సంస్థపై బ్యాన్ విధించాలి. ఇలాంటి సినిమాలను తీసే నీలేష్ కృష్ణ లాంటి దర్శకులను అరెస్ట్ చేయాలి. హిందూ వ్యతిరేక సినిమాలు చేసే నటీనటులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే, హిందూ వ్యతిరేక, లవ్ జిహాద్ ను ప్రోత్సహించే సినిమాలు రావడం ఆగిపోతాయి. ఓటీటీ కంటెంట్ మీద కూడా సెన్సార్ షిప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

‘అన్నపూర్ణి’ వివాదానికి కారణం ఏంటి?

‘అన్నపూర్ణి’ సినిమాలో నయనతార బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. ఈ సినిమాలో రాముడు మాంసం తిన్నట్లు చెప్తారు. హిందూ అమ్మాయి అయిన నయనతార నమాజ్ చేస్తుంది. వీటితో పాటు బ్రాహ్మణులను కించపరిచేలా చాలా సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారని  తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, పలు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ఈ సినిమాపై కేసులు పెట్టాయి.

క్షమాపణలు చెప్పిన జీ స్టూడియోస్    

‘అన్నపూర్ణి’ వివాదం ముదరడంతో జీ స్టూడియోస్ స్పందించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించనున్నట్లు తెలిపింది. అప్పటి వరకు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా వల్ల ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అన్నపూర్ణి’ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించగా, నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు చేశారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల అయ్యింది.

Read Also: థియేటర్లలో ‘హనుమాన్‌’ తుఫాన్, ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Yuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP DesamWedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్క

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
Oppo F27 5G: ఒప్పో ఎఫ్27 5జీని లాంచ్ చేసిన బ్రాండ్ - ధర, ఫీచర్లు ఇవే!
ఒప్పో ఎఫ్27 5జీని లాంచ్ చేసిన బ్రాండ్ - ధర, ఫీచర్లు ఇవే!
Stree 2 Success Bash: తమన్నా డ్యాన్స్‌కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్
తమన్నా డ్యాన్స్‌కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్
Kolkata Doctor Case: కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు- తెలుగు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి చోటు
కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు- తెలుగు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి చోటు
Revanth Reddy: స్కూలు పిల్లలతో సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్స్ వైరల్, కేటీఆర్ కౌంటర్
స్కూలు పిల్లలతో సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్స్ వైరల్, కేటీఆర్ కౌంటర్
Embed widget