‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి బిగ్ అప్డేట్, ఉగాదికి ఫస్ట్ సింగిల్ సాంగ్
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ వాట్సాప్ చాట్ రూపంలో వీడియో చేసి రిలీజ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజాగా నటిస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీను పి.మహేష్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అనుష్క చాలా రోజుల తర్వాత మళ్లీ గ్లామర్ రోల్ లో కనిపించనుండటంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీను ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు మేకర్స్. అందుకే మూవీ టైటిల్ ను కూడా క్యాచీగా పెట్టారు. మూవీకు సంబంధించిన అప్డేట్ లను కూడా అలాగే రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. గతంలో విడుదల అయిన మూవీ పోస్టర్, ఫస్ట్ లుక్ లకు మంచి స్పందనే వచ్చింది. తాజాగా మరో అప్డేట్ తో ముందుకొచ్చారు స్వీటీ టీమ్. ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ వాట్సాప్ చాట్ రూపంలో వీడియో చేసి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ మొదటి లిరికల్ సాంగ్ ను అనౌన్స్ చేస్తూ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. వాట్సాప్ లో చాట్ చేస్తూ సాంగ్ లోని కొన్ని లిరిక్స్ ను విడుదల చేశారు. ఇది చూడగానే పెప్పీ డాన్స్ నంబర్ సాంగ్ లాగా అనిపిస్తోంది. #MSMP పేరుతో ఉన్న వాట్సాప్ చాటింగ్ ద్వారా సరికొత్తగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసి మూవీపై మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. ఇక ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం పై ఇటు ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకుల్లోనూ భారీగానే అంచనాలు ఉన్నాయి. అనుష్క కూడా ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి చూస్తోందట. ప్రస్తుతానికి ఆమె ఆశలన్నీ ఈ మూవీపైనే ఉన్న పెట్టుకుందట స్వీటీ. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ విడుదల కాబోతోంది. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కపించనుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ‘నిశ్శబ్దం’ వంటి సినిమా తర్వాత తనకు తన ఇమేజ్ కు తగిన స్క్రిప్ట్ రావడంతో ఈ సినిమాకు ఓకే చెప్పింది స్వీటీ. అనుష్క ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మహేష్. ఈ మూవీను యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్ లో అనుష్క అంతకముందు ‘భాగమతి’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఇక హీరో నవీన్ పొలిశెట్టి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నవీన్. ‘జాతీ రత్నాలు’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నవీన్ మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
View this post on Instagram